వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ సమస్యనే పరిష్కారం అయ్యింది .. కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కాదా .. జగన్ కు పవన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కాదా..!! || Pawan Linked Kapu Reservations With Kashmir Issue

ఇప్పుడు యావత్ భారతదేశం కాశ్మీర్ సమస్య గురించి మాట్లాడుతోంది. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దుచేస్తూ మోడీ సర్కార్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం గురించి చర్చిస్తోంది. ఇక మీడియాలోనూ, సోషల్ మీడియాలో ను కాశ్మీర్ వ్యవహారమే ట్రెండ్ అవుతోంది. ఇక ఇదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆర్టికల్ 370 కి మద్దతు ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి క్లిష్టమైన తెలంగాణ సమస్య, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు కాపుల రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం దొరకదా అంటూ పవన్ ప్రశ్నించారు. కచ్చితంగా కాపు రిజర్వేషన్ సమస్యను పరిష్కరించవచ్చని ఆయన పేర్కొన్నారు.

కాపుల రిజర్వేషన్ సమస్యపై గట్టిగా మాట్లాడిన పవన్

కాపుల రిజర్వేషన్ సమస్యపై గట్టిగా మాట్లాడిన పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన కాపుల రిజర్వేషన్ సమస్యను జాతీయ సమస్య అయిన కాశ్మీర్ సమస్య తో ముడిపెట్టి చాలా లాజికల్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కాపుల సమస్యపై చాలా గట్టిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రాజకీయ ప్రయోజనాల దృష్టితో కాకుండా, సమస్యను పరిష్కరించాలనే కోణంలో ఆలోచించాలని హితవు పలికారు. కాపుల రిజర్వేషన్‌ విషయాన్ని జగన్‌ రాజకీయ కోణంలో చూస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇప్పటికైనా కాపు రిజర్వేషన్ అంశంపై జగన్ ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఆయన కోరుతున్నానని చెప్పారు .పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన ఆత్మీయ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.

టీడీపీ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయానికి నో అంటున్న వైసీపీ ..

టీడీపీ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయానికి నో అంటున్న వైసీపీ ..

పార్టీలు, రాజకీయ నాయకుల ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలపైనే బ్యూరోక్రాట్లు దృష్టి సారించాలని పవన్ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో చాలా మంది అధికారులు కోర్టుల చుట్టూ తిరగడం, జైళ్లకు వెళ్లడం చూశామని గుర్తు చేశారు. ఇక తప్పు చేస్తే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. అధికారులే బలైపోతారు అని పవన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థికంగా వెనకబడిన తరగతుల రిజర్వేషన్‌ అంశంలో గత టిడిపి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేం తీసేస్తాం అన్నట్లుంది వైసీపీ ప్రభుత్వం వైఖరి. రాజధాని అమరావతి విషయంలోనూ, పోలవరం ప్రాజెక్టు విషయంలో నూ, ఇక ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశంలోనూ గత ప్రభుత్వం చేసిన వాటిని తీసేస్తామన్న చందంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ విమర్శించారు.

కాపుల రిజర్వేషన్ విషయంలో సీఎం జగన్ మాట మార్చటం సరికాదన్న పవన్

కాపుల రిజర్వేషన్ విషయంలో సీఎం జగన్ మాట మార్చటం సరికాదన్న పవన్

ఉన్న రిజర్వేషన్లను పెంచుతూ కేంద్రం వెసులుబాటు ఇచ్చి రాష్ట్రాలకు తగ్గట్టుగా చేసుకోమని చెప్పిందని పేర్కొన్న పవన్ అందుకు తగ్గట్టే ఆర్థికంగా వెనకబడ్డ తరగతులకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌ ప్రజలకు అండగా నిలబడాలని , కాపుల రిజర్వేషన్ విషయంలో మాట మార్చడం సరికాదని, కాపులను ఓసీలు కాదు, బీసీలు కాదు అన్నట్లు మాట్లాడి గందరగోళానికి గురి చేయవద్దని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ప్పుడు కాపుల రిజర్వేషన్ అంశం పరిష్కారం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు .

పరిష్కరించకుంటే కాపుల రిజర్వేషన్ అంశం పెను సమస్యగా మారుతుందని హెచ్చరించిన పవన్

పరిష్కరించకుంటే కాపుల రిజర్వేషన్ అంశం పెను సమస్యగా మారుతుందని హెచ్చరించిన పవన్

జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో కాపుల రిజర్వేషన్ అంశం పెను సమస్యగా మారుతుందని ఆయన తేల్చిపారేశారు. ఇంతకాలానికి కాపుల రిజర్వేషన్ అంశంపై పవన్ కళ్యాణ్ నోరు తెరిచి ఇంత బలంగా మాట్లాడటంతో కాపు సామాజిక వర్గం లో సంతోషం వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాపు సామాజికవర్గం ఆహ్వానిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఈ తరహా నిర్ణయం తీసుకుంటే అది వేరే లా ఉండేదని, కాపులకు పవన్ దూరంగా ఉండటం వల్లే ఆయన నష్టపోయారని , ఇప్పుడు పవన్ కాపులకు అండగా ఉండడం నిజంగా హర్షించాల్సిన విషయమని కాపు సామాజిక వర్గం భావిస్తోంది.

English summary
Speaking to media persons in Bheemavaram, Pawan questioned whether the problem of Telangana and Kashmir has the solution and to the Kapu reservation issue there is no solution ?. He stated that the Kapu reservation problem could be solved. He concludes that the Kapula reservation will become a major issue in the future if Jagan do not take a decision.Pawan Kalyan opens his mouth and talks strongly about the reservation issue of Kapu community. The Kapu community is inviting comments made by Pawan Kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X