అనురాధ దంపతుల హత్య: అప్పటి నుంచి ఇప్పటి దాకా...

చిత్తూరు: చిత్తూరులో రౌడీయిజం కొత్తది కాదు, దానికో చరిత్ర ఉంది. అది రక్తచరిత్ర. అంగబలం ఉన్నవారు ప్రాంతాలవారీ నగరంపై ఆధిపత్యం, పెత్తనం చెలాయించే ధోరణి ఆది నుంచీ కనిపిస్తూ వస్తోంది. 1970, 80 దశకాల నాటికి కొండమిట్ట, శంకరయ్యగుంట, సంతపేట వంటి ప్రాంతాలకు చెందిన వారు నగరంపై ఆధిపత్యం చెలాయించేవారని అంటారు.

చిత్తూరు ముఠాతగాదాలకు సంబంధించిన కథనాలు బుధవారం మీడియాలో వచ్చాయి. 1980వ దశకంలో విద్యార్థి సంఘ నేతగా ఉన్న మాజీ శాసనశభ్యుడు సీకేబాబు అంగబలంతో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరిని ఎదుర్కోవడం ద్వారా పట్టణంలో అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. దాంతో రాజకీయాల్లోకి ప్రవేశించి మున్సిపల్‌ కౌన్సిలర్‌ అయ్యారు. ఆ తర్వాత నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి 20 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.

ఓ ప్రముఖ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం - అదే పద్ధతిలో సంతపేటకు చెందిన ఆర్‌.గోపీనాథ్ కూడా ఓ వర్గానికి మద్దతిచ్చి రాజకీయాల్లో నిలదొక్కుకుని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, డీసీసీ అధ్యక్షుడుగా ఎదిగారు. వీరి మధ్య కొంతకాలం పాటు పోటీ రాజకీయాలు నడిచాయి. రాజకీయ ప్రవేశానికి ముందు నుంచే సీకే బాబుపై పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

Katari Anuradha couple murder: Rowdism in Chittoor is not new

నగర రాజకీయాల్లో హింస ప్రవేశించి పలువురు హత్యలకు గురయ్యారు. చాలా మంది దాడులకు, దౌర్జన్యాలకు గురయ్యారు. కొండమిట్టలో రామచంద్రయ్య, తణికాచలం వంటి పేరుమోసిన రౌడీల హత్యలు జరిగాయి. మురకంబట్టులో న్యాయవాది సంపత్‌ వంటివారు రాజకీయ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. 1999 నాటికి పరిస్థితులు చల్లబడ్డాయి. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి హత్య కేసులో నాటి ఎమ్మెల్యే సీకేబాబు అరెస్టయ్యారు. అయితే పులు కేసులు సీకే బాబుపై నమోదైనా సరైన సాక్ష్యాధారాల్లేక కోర్టులో నిలవలేదు.

2005 నుంచి రాజకీయాలు హింసకు ఆలవాలంగా మారాయి. ఆ ఏడాదిలో టీడీపీ నేత కటారి మోహన్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా అన్నట్టు సీకేబాబుపై రెండు సార్లు భారీ ఎత్తున హత్యాయత్నాలు జరిగాయి. 2007 ఫిబ్రవరిలో బిహారు నుంచి కిరాయి హంతకులను రంగంలోకి దింపిన ప్రత్యర్థులు సీకేపై కాల్పులు జరపగా ఆయన తప్పించుకున్నారు.

ఒక గన్‌మ్యాన్‌, మరో ఉద్యోగి చనిపోయారు. గన్‌మ్యాన్‌ కాల్పుల్లో కిరాయి హంతకుల్లో ఒకరు మరణించారు. అదే ఏడాది డిసెంబరులో సీకే బాబు ప్రయాణిస్తున్న వాహనాన్ని మైన్‌ పెట్టి పేల్చేశారు. అందులో సీకే బాబు తప్పించుకున్నారు. అయితే ఒక గన్‌మ్యాన్‌ మృతిచెందారు. మరో గన్‌మ్యాన్‌ క్షతగాత్రుడయ్యాడు. ఆ కేసులింకా నడుస్తూనే ఉన్నాయి.

తెలుగుదేశం నేత కటారి మోహన్‌ భార్య అనురాధ మేయరు అయిన నేపథ్యంలో ఏడాది నుంచీ ఆ కుటుంబానికి, వారి సమీప బంధువుకూ నడుమ వైరం తలెత్తింది. చివరికి మంగళవారం ఘటనలో మేయర్‌ దంపతుల హత్య జరిగింది. దీంతో చిత్తూరులో హింసారాజకీయాలు ఆగిపోతాయా అంటే చెప్పలేమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+