కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్, జనసేన ను పార్టీగా కన్సిడర్ చేయలేదా : ఎన్నికల్లో సత్తా చాటుతా
కొద్ది కాలం క్రితం తన ట్వీట్ల ద్వారా పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన కత్తి మహేష్ తిరిగి ట్వీట్లు మొదలు పెట్టారు. గతంలో పవన్ ఫ్యాన్స్ - కత్తి మహేష్ మధ్య చర్చల ద్వారా వివాదం పరిష్కారం అయింది. కొంత కాలం కామ్ గా ఉన్న కత్తి మహేష్ ఇప్పుడు తాజా గా విడుదలైన సర్వేల్లో జనసేన గురించి ప్రస్తావించకపోవటం పై ప్రశ్నించారు. జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన పోస్టింగ్‌లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
కత్తి ట్వీట్..జనసేన లక్ష్యంగా
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపిలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైసిపి 19 సీట్లు, టిడిపి 6సీట్లు గెలుచుకుంటా యని రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ పేర్కొంది. తాము చేసిన సర్వేలో తేలిందని ప్రకటించింది. అయితే ఓట్ల శాతం పరంగా నూ వైసిపికి 4103 శాతం, టిడిపి కి 33.1 శాతం ఓట్లు పడతాయని విశ్లేషించింది. ఈ సర్వే పై టిడిపి వ్యతిరేకంగా స్పందిం చింది. ఇదే సమయంలో సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఓ పోస్టింగ్ ద్వారా జనసేన పై విమర్శ చేసారు. అందులో జనసేన పార్టీ గురించి చేసిన కామెంట్ ఇప్పుడు పవన్ అభిమానులు ఆగ్రహం తెప్పించింది. కత్త మహేష్ చేసిన ట్వీట్ లో .. నేషనల్ మీడియా సర్వేలలో కనిపించని జనసేన. అంటే పార్టీగా కూడా కన్సిడర్ చెయ్యడం లేదా లేక రాబోయే ఎన్నికల్లో కనీస ఉనికిని చాటుకోలేని పార్టీ అని వాళ్ళు డిసైడ్ అయ్యారా..? అని పేర్కొన్నారు.

ఎన్నికల్లో సత్తా తెలుస్తుంది..
కత్తి మహేష్ ట్వీట్ పై పవన్ అభిమానులు..జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన ఫలితాలొస్తే కదా..ఎవరి సత్తా ఏంటో తెలిసేది అంటూ మమేష్ కామెంట్ కు స్పందనా తిరిగి కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇది జనసేన పార్టీలో.. పవన్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. దీని పై ఇంకా కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది.