'బాబు గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తా, నేను గెలిస్తే రాజీనామా చేయాలి'
విజయవాడ: నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఏ కులం వారు ఎంత దోచుకుంటున్నారో బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ఈ చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిస్తే తాను రూ.100 కోట్లు ఇస్తానని దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు గురువారం సవాల్ చేశారు.
నవ్యాంధ్రలో ఏ కులం వారు ఎంత దోచుకుంటున్నారో సీఎం చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అన్నారు. చర్చలో నేను ఓడిపోతే రూ.100 కోట్లు ఆయనకు ఇస్తానని, ఆయన ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అన్నారు.

నవ్యాంధ్రలో కుల వివక్ష చూపుతోంది మీరు కాదా అన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పుట్టిన కులంలో తాము పుట్టినందుకు గర్విస్తున్నామన్నారు. చంద్రబాబు దళితులను అవమానించారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలన్నారు.
నిలువెత్తు డబ్బు పోసినా టిడిపిలో చేరను: మేకా ప్రతాప్ అప్పారావు
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని వైసిపి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. నిలువెత్తు డబ్బు పోసినా తాను తెలుగుదేశం పార్టీలో చేరే ప్రసక్తి లేదన్నారు. టిడిపి తన పైన దుష్ప్రచారం చేస్తోందన్నారు. తాను చివరి వరకు వైసిపిలోనే ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications