ఎ1గా చేర్చాల్సిందే: చంద్రబాబుపై ఎంపి కవిత తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఏ-1 నిందితుడిగా చేర్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును ఏ-1గా చేర్చి రేవంత్‌రెడ్డిని ఏ-2గా చేర్చాలని అధికారులను కోరుతున్నానని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలనను చూడలేకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ టీడీపీలకు తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులుండని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాల దుకాణం, పార్టీని మూసుకుని వచ్చి హైదరాబాద్‌లో కొబ్బరి కాయల దుకాణం పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలికారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తు్న అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరి కాయలు అమ్ముకుంటే మంచి గిరాకీ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్‌ఎస్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాము టిఆర్ఎస్ ఏడాది పాలనకు ఐదు మార్కులు వేస్తున్నామని చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఎన్ని మార్కులు వేశారో గమనించాలని సూచించారు.












Click it and Unblock the Notifications