విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మపై పోటీ చేసి, ఓడిస్తా: అద్వానీతో కావూరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: విశాఖపట్నం లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మకు అవకాశాలు మెరుగవుతున్నాయి. బిజెపి దగ్గుబాటి పురందేశ్వరికి విశాఖపట్నం సీటును కేటాయించకపోవడం విజయమ్మకు కలిసి వచ్చినట్లే. మరో వైపు, విశాఖ సీటు ఇస్తే తాను విజయమ్మపై పోటీ చేస్తానని మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు చేసిన విజ్ఞప్తిని కూడా బిజెపి నాయకత్వం పట్టించుకోలేదు.

బిజెపి అగ్రనేత ఆద్వానీతో కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడు కావూరు సాంబశివరావు మంగళవారం భేటీ అయ్యారు. విశాఖ సీటును తనకు కేటాయిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయలక్ష్మిని ఓడిస్తానని ఆద్వానీతో కావూరు చెప్పినట్లు తెలిసింది. అయితే, విశాఖపట్నం సీటును ఆయనకు బిజెపి ఇవ్వడానికి మొగ్గు చూపలేదు.

కొద్దిరోజులుగా ఆయన సీటుకోసం బిజెపి నాయకులను తరచుగా కలుస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థనను పట్టించుకోకుండానే బిజెపి మంగళవారం రాత్రి విశాఖ టికెట్‌ను హరిబాబుకు ఖరారు చేసింది.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కావూరి సాంబశివ రావు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయన బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. అయితే, ఆయన లోకసభ సీటు కోసం తీవ్రంగానే ప్రత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

English summary
It is said that former union minister Kavuri Sambasiva Rao appeal for Visakhapatnam Lok Sabha seat has been ignored by BJP leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X