చవటలు: సమైక్యవాదులు, జగన్‌పార్టీపై కావూరి ఆగ్రహం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావును సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన వారిపై నోరు జారారట. చవటలు.. దద్దమ్మలు.. అంటూ మండిపడ్డారు. చింతలపూడి పాత బస్టాండ్‌లో మంగళవారం మినీ బస్టాండ్ ప్రారంభించేందుకు వచ్చిన కావూరుకు సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.
సమైక్యవాదులు కావూరు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆగ్రహంతో కారు దిగిన కావూరు మైక్ తీసుకుని చవటలు.. దద్దమ్మలు చేతకానివారని ఆందోళనకారులను నిందిస్తూ, మాట్లాడేవాళ్లు ముందుకొచ్చి మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. దీంతో రెచ్చిపోయిన సమైక్యవాదులు ఆయనపైకి కోడిగుడ్లు విసిరారు. పోలీసుల మీద, కేంద్ర మంత్రి కావూరు మీద కోడిగుడ్లు పడ్డాయి. సమైక్యాంధ్ర ద్రోహి కావూరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసుల రక్షణ వలయం మధ్య కావూరి బయటపడాల్సివచ్చింది. కావూరిని అడ్డుకున్న వారిలో సమైక్యవాదులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డు తగిలారు.
కావూరి పదవులకు, డబ్బుకు అమ్ముడుపోయారని, సమైక్య ద్రోహి అని ఆరోపిస్తూ, కావూరి గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించడమేగాక పెద్దయెత్తున నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి కావూరి వెధవలు, సన్నాసులూ అంటూ మైక్‌లోనే అసభ్య పదజాలంతో ఆందోళనకారులపై విరుచుకుపడటంతో ఆందోళనకారులు కోడిగుడ్లు విసిరారు.












Click it and Unblock the Notifications