అద్భుతాలు జరుగొచ్చు: జగన్‌తో కుమ్మక్కుపై కావూరి

పార్టీ సిద్ధాంతాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని అంతేతప్ప రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోవడం సరికాదని చెప్పారు. సీమాంధ్రలో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ పరిస్థితి సీమాంధ్రలో దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.
దానిని సరిదిద్దుకోవడానికి పార్టీకి ఇంకా సమయం ఉందని చెప్పారు. ముందు ముందు ఎలాంటి అద్భుతాలైనా జరగవచ్చునని కావూరి అబిప్రాయపడ్డారు.
డిగ్గీని కలిసిన జెడి శీలం
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కేంద్రమంత్రులు జెడి శీలం, పల్లం రాజులు గురువారం కలిశారు.
ఓట్లు, సీట్ల కోసం: గాదె
ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేశారని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి ఆరోపించారు. జగన్ బెయిల్ విషయంలో ప్రతిపక్షాల విమర్శలు అవాస్తవమన్నారు.
ఏ త్యాగానికైనా సిద్ధం: దేవినేని
సమైక్యాంధ్ర కోసం తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం విజయవాడలో అన్నారు. జగన్ పార్టీ కుట్రలు, కుతంత్రాలను తాము బట్టబయలు చేస్తామన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్, జగన్, పిసిసి చీఫ్ బొత్సలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications