Romanchakam First Review: రోమాంచకం మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
ఇటీవలికాలంలో లవ్ స్టోరీస్ కు జెన్ జీ యువత కనెక్ట్ అవుతోంది. లవ్, రొమాన్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. గర్ల్ ఫ్రెండ్, కపుల్ ఫ్రెండ్లీ, లిటిల్ హార్ట్స్, దివానా, చెన్నై లవ్ స్టోరీ తదితర సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే ఈ జనరేషన్ కు కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ మూవీ అంటే అందరికీ 'అర్జున్ రెడ్డి' మాత్రమే గుర్తుకొస్తుంది. 2017 లో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. విజయ్ దేవరకొండ- సందీప్ రెడ్డి వంగా చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా రాబట్టింది.
అయితే ఇప్పుడు అదే భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై మరో క్రేజీ లవ్ స్టోరీ రాబోతుంది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అదే రొమాంచకమ్ మూవీ.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్, అనంతిక సానికుమార్ జంటగా నటించారు. ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై రొమాంచకమ్ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తర్వాత ఈ బ్యానర్ పై వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీని ఇటీవల చూసిన సెన్సార్ బృందం క్లీన్ మూవీగా అభివర్ణించింది. కాకపోతే కొన్ని అక్కడక్కడా మార్పులు చేశారు. ఇక ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 22 నిమిషాలుగా ఉంది.

రొమాంచకం మూవీ రివ్యూ చూస్తే.. ఈ సినిమాలోని హీరో సుమంత్ ప్రభాస్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ల కెరీర్ పరంగా ఎంచుకున్న గోల్స్ వాళ్లకు చాలా వరకు ఇబ్బందిని కలిగిస్తాయని టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ జంట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. ఫైనల్ గా ఇద్దరు ఒకటయ్యారా..? లేదా..? అనేది ఈ సినిమా స్టోరీగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని చెబుతున్నారు. మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 3న విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ రోజే ఈ మూవీకి సంబంధించిన పూర్తి రివ్యూ బయటకు రానుంది.












Click it and Unblock the Notifications