2 జిల్లాల్లో కావూరికి సెగ: ఎస్కార్టు కారులో వెళ్లిన వైనం

Kavuri Sambasiva Rao
విజయవాడ/ఏలూరు: కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావుకు సమైక్య సెగ తగిలింది. ఆయనను కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొదట కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద సమైక్యవాదులు ఆయనను అడ్డుకున్నారు.

ఆ తర్వాత ఏలూరు కలపర్రు చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు, సమైక్యవాదులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కావూరి తన కారును వదిలి ఎస్కార్టు వాహనంలో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడారు.

కావూరి సాంబశివ రావు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మంత్రి పదవి పొందారని, తన కారును వదిలి పెట్టి వేరే కారులో దొంగలా పారిపోయారని మండిపడ్డారు.

కాగా, కావూరి సోమవారం నల్గొండ జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేతను ఆధునీకరించేందుకు పోచంపల్లి హ్యాం డ్లూమ్‌పార్కు అభివృద్ధికోసం రూ.15 కోట్లను కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు ద్వారా 2 వేల మగ్గాలు నడిపించాల్సి ఉండగా కేవలం 150 మగ్గాలకే పరిమితమైందన్నారు. పెట్టుబడి, నిర్వహణ కోసం వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించడం భారంగా మారిందన్నారు. కేంద్రం నుంచి రూ.15 కోట్ల వరకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+