పదవొస్తే మారను: టిపై కావూరి, బాబుకు వెంకయ్య షాక్

ఈ సందర్భంగా మాట్లాడారు. తాను మొదటి నుండి సమైక్యవాదినే అన్నారు. పదవి వచ్చినంత మాత్రాన అభిప్రాయం మారిపోతుందని అనుకోవడం పొరపాటన్నారు. గతవారం తనను కొంతమంది సమైక్యవాదం పేరుతో అడ్డుకున్న వారు మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ పురికొల్పిన వ్యక్తులే అన్నారు.
ఎపిఎన్జీవోలు చేస్తున్న సమైక్యాంధ్ర పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రంపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం వల్ల ఉపయోగం లేదని, అవిశ్వాసం నోటీసు చర్చకు రాదనే తాను మద్దతివ్వలేదన్నారు.
పొత్తులపై ఊహాగానాలు: వెంకయ్య
పొత్తులపై ప్రచారం అంతా ఊహాగానాలేనని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు హైదరాబాదులో అన్నారు. కొంతకాలంగా టిడిపి - బిజెపి పొత్తుపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్య స్పందించారు. పొత్తులపై వస్తున్నవన్నీ ఊహాగానాలే అన్నారు. ఏ రాష్ట్రంలో తాము పార్టీలతో పొత్తు విషయమై చర్చించలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే పొత్తులపై చర్చిస్తామన్నారు.
కాంగ్రెసు పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు పరంపగా ఉన్న మైనార్టీ, షెడ్యూల్డ్ తెగల కులాల నియోజకవర్గాలు కూడా తమ వశమయ్యాయన్నారు. యూపిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆధార్ కాంగ్రెసుకు నిరాధార్‌గా, ఆహార భద్రత పథకం రాజకీయ భద్రత లేకుండా చేస్తోందన్నారు. కాంగ్రెసు అంటే నమ్మక ద్రోహులు, విశ్వాస ఘాతకులు అని, వారికి గర్వం, అధికారమదం పెరిగినట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications