జగన్ పార్టీకి మనుగడ లేదు: కావూరి, సోనియాపై ఫైర్

2019 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం పార్టీలే ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి పదవితో ఎంత సంపాదించవచ్చునో చూపించిన ఘనత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులదేనని ఆయన అన్నారు.
తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్సించారు. దేశానికే కాదు, సొంత కుటుంబానికి కూడా సోనియా ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసు పార్టీకి ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమ పార్టీదేనని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు హరిబాబు అన్నారు. సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications