కేబీసీలో పీవీ సింధును టెన్షన్ పెట్టిన ‘వైసీపీ’ ప్రశ్న
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 9వ సీజన్ షోలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రూ. 25 లక్షలు గెలుచుకుంది. అయితే ఈ షోలో అడిగిన 13వ ప్రశ్న పీవీ సింధును టెన్షన్ పెట్టింది. ఆ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమరావతి: 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 9వ సీజన్ షోలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రూ. 25 లక్షలు గెలుచుకుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోలో శుక్రవారం జరిగిన 30వ ఎపిసోడ్ కు పీవీ సింధు పార్టిసిపేట్‌గా వెళ్లింది.
తన సోదరితో కలిసి గేమ్ ఆడిన సింధు 12 ప్రశ్నలను దాటుకుని రూ. 12.50 లక్షలను గెల్చుకుంది. అయితే ఈ షోలో అడిగిన 13వ ప్రశ్న పీవీ సింధును టెన్షన్ పెట్టింది. షో చూస్తున్న వారిలో తీవ్ర ఉత్కంఠను, ఆసక్తిని రేకెత్తించిన రూ.25 లక్షల ఆ ప్రశ్న.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి సింధును బిగ్‌బీ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 'వైఎస్సార్' అనే అక్షరాలకు పూర్తి వివరణ ఏంటి? అనే ప్రశ్నను అమితాబ్ సంధించారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా ఎ)యువ సత్య రాజ్యం, బి) ఎడుగూరి సంధింటి రాజశేఖర, సి) యూత్ షల్ రూల్, డి) యువజన శ్రామిక రైతు.. అంటూ ఆయన నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ నాలుగు ఆప్షన్స్‌లో సింధు మొదట 'బి' ఎంపిక చేసుకుంది.
అయితే.. 'బాగా ఆలోచించి సమాధానం చెప్పండి..' అంటూ మరోసారి అమితాబ్ సూచించడంతో సింధు తన సోదరి సాయం తీసుకుంది. చివరికి సరైన సమాధానం 'డి' అని చెప్పి రూ.25 లక్షలు తన సొంతం చేసుకుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications