సెక్షన్8: ఇద్దరిది రాద్ధాంతమేనా, కేసీఆర్ దేనికైనా రె'ఢీ'? పవన్‌పై అదే కోపం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు సెక్షన్ 8 పైన అనవసర రాద్దాంతం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి విపక్షాలు.

ఓటుకు నోటు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు సెక్షన్ 8ను తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో సెక్షన్ 8 పైన ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న టీఆర్ఎస్ నాడు అసెంబ్లీలో దీనిని ప్రవేశ పెట్టినప్పుడే ఎందుకు అడగలేదని దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తీసుకు రావడాన్ని తప్పు పడుతున్నాయి. ఓటుకు నోటు నుండి తప్పించుకునేందుకు దానిని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపిస్తున్నారు.

అయితే, హైదరాబాదులో రక్షణ లేనందునే సెక్షన్ 8 తెరపైకి తీసుకు వచ్చామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కన పెడితే... మరో వంద మందికి పైగా ముఖ్యుల ఫోన్లు ట్యాపింగ్‌ అయ్యాయని చెబుతున్నారు. తద్వారా మిగతా వారి ఫోన్లను ట్యాపింగ్ ఎందుకు చేశారని, ఇది దేనికి నిదర్శనమని ప్రశ్నించే వారు లేకపోలేదు.

KCR and Chandrababu politics with Section 8!

ఏపీ విభజన చట్టాన్ని తానే తయారు చేశానని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు అందులోని సెక్షన్ 8ను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఏపీ మంత్రులు ప్రశ్నించారు. తాజాగా దిగ్విజయ్ కూడా కేసీఆర్ పైన మండిపడ్డారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు, గత్యంతరం లేక సెక్షన్ 8 అంగీకరించామన్న కోదండరామ్ వ్యాఖ్యలను గమనించాలని అంటున్నారు.

కేసీఆర్ దేనికైనా సిద్ధమా?

సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ దేనికైనా సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ఐదు సీట్లు గెలవకుంటే అసెంబ్లీని రద్దు చేస్తానని హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు సెక్షన్ 8 అమలు చేస్తే కూడా కేసీఆర్ తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జాతీయస్థాయి నేతలను కూడగట్టేందుకు ఆయన ఢిల్లీలో నిరాహార దీక్ష చేయవచ్చు లేదా అసెంబ్లీని రద్దు కూడా చేసే అవకాశాలను కొట్టిపారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. తద్వారా సెంటిమెంటుతో ఎన్నికలకు వెళ్లే యోచన కూడా అందులో ఉందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ పైన సంతృప్తి లేదు!

ఓటుకు నోటు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ పెదవి విప్పాలన్న వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు, ఇప్పుడు ఆయన స్పందనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ ఏపీ సీఎం చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌గా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+