ప్రజలపై కెసిఆర్ వరాల వర్షం, కీలక నిర్ణయాలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు చేసింది. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయాలు చేసింది. 43 అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఆరు గంటల పాటు జరిగిన మంత్రి వర్గ సమావేశానంతరం కెసిఆర్ స్వయంగా నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

తెలంగాణ ప్రజలపై కెసిఆర్ కురిపించిన ముఖ్యమైన వరాలు, తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

K Chandrasekhar Rao

# బతుకమ్మ, బోనాలు రాష్ట్ర పండుగలు
# ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై సిట్టింగ్ జడ్జితో కమిటీ ఏర్పాటు
# గల్ఫ్‌లోని తెలంగాణ ఎన్నారైలకు సంక్షేమ బోర్డు
# ఆటోలు, ట్రాలీలపై పన్ను రద్దు
# పేదల కోసం కల్యాణలక్ష్మి అనే కొత్త పథకం
# పింఛనుదారులకు కొత్త కార్డులు. దసరా, దీపావళి మధ్య పెన్షన్ల పంపిణీ
# పివి పేరుతో వెటర్నరీ యూనివర్శిటి ఏర్పాటు
# వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు
# లక్ష రూపాయల లోపు రైతుల రుణాల మాఫీ, బంగారంపై రైతు రుణాలు కూడా మాఫీ
# పదవీ విరమణ వయస్సు పెంచే ఆలోచన లేదు
# కమతాల ఏకీకకరణ చేస్తాం
# నిష్ణాతులతో స్టేట్ అడ్వయిజరీ కౌన్సీల్
# తెలంగాణ జర్నలిస్టు భవనం నిర్మాణం
# తెలంగాణ టూరిజం కార్పోరేషన్ ఏర్పాటు
# తెలంగాణకు ప్రత్యేక కాలుష్య నియంత్రణ మండలి
# కొత్త వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు
# అమరుల కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగం
# పవర్‌లూం కార్మికుల రుణాలు మాఫీ
# హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు కొత్త వాహనాలు
# పక్కా ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలు
# పెన్షన్ దారులకు కొత్త కార్డులు
# కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ
# అగ్రవర్ణాల్లోని పేదలకు ఫాస్ట్ వర్తింపు
# డంపింగ్ యార్డుల కోసం 2 వేల ఎకరాలు
# జంటనగరాల్లో కల్లు దుకాణాలు పునరుద్ధరిస్తాం
# పేకాట క్లబ్బులు మూసేస్తాం
# తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చిన తర్వాత వేలాది పోస్టుల భర్తీ
# అమరుల కుటుంబాలకు పూర్తిగా ఉచిత వైద్యం
# కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం
# 500 జనాభా ఉన్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం
# ఉద్యోగులకు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్
# విద్యార్థుల సంక్షేం కోసం ఫాస్ట్ పథకం
# హైదరాబాదును విశ్వనగరంగా మార్చేందుకు కొత్త మాస్టర్ ప్లాన్
# రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఏర్పాటు
# మైనార్టీల సంక్షేమానికి రూ. 1000 కోట్లు
# కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే అంశంపై అధ్యయనానికి కమిటీ
# తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు
# వ్యాట్ చట్టం సవరణ
# కెజి నుంచి పిజి వరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్య.
# గిరిజనుల అభివృద్ధికి కమిషన్ ఏర్పాటు
# నిరుపేద దళిత వ్యవసాయాధార కుటుంబాలకు 3 ఎకరాల భూమి
# వృద్ధులు, వితంతువులలకు వేయి రూపాయల పింఛను
# 2011 నుంచి ఉద్యమకారులపై ఉన్న కేసుల ఎత్తివేత
# వికలాంగులకు రూ. 1500 పింఛను
# హైదరాబాద్, సికింద్రాబాదు జంటనగరాల్లో కల్లు దుకాణాల పునరుద్ధరణ
# ఆర్ఎంపిలకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిక్షణ
# టూరిజం కార్పోరేషన్ ఏర్పాటు
# రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు
# హార్టి కల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+