కెసిఆర్ మార్క్ కేబినెట్: డైరెక్టర్, విఐపిల క్యూ(పిక్చర్స్)
హైదరాబాద్: తెరాస అధ్యక్షులు, కాబోయే తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో తనదైన ప్రత్యేకత కనబర్చాలని ఉవ్వీళ్లూరుతున్నారు. దానికి అవసరమైన అధికారులు, మంత్రివర్గం జాబితాను సిద్ధం చేస్తున్నారు. కీలక స్థానాల్లోని అధికారులు, మంత్రివర్గం ఎలా ఉండాలో ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. అవినీతిరహిత పాలన అందిస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కెసిఆర్, ఆచరణలో చూపించాలని ప్రయత్నిస్తున్నారు.
నిజాయితీపరులైన అధికారులను పేషీలో ఉండే విధంగా ఎంపిక చేసుకుంటున్నారు. సిఎం పేషీ నిజాయితీతో ఉంటే దాని ప్రభావం కిందిస్థాయి వరకు వెళ్తుందని కెసిఆర్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు సిద్ధమైతే, అదే సమయంలో ఉద్యోగులు నిజాయితీగా పని చేయాలని, అవినీతికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే అధికారుల ఎంపికతోపాటు మంత్రివర్గం ఉండాలన్నది కెసిఆర్ భావనగా కనిపిస్తోంది.
ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఈ అంశాలపై పార్టీ సహచరులతో, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. 26న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి మోడీ ఆహ్వానించడంతో వెళ్లాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ఆదివారమే కెసిఆర్ ఢిల్లీ వెళ్లి, 26న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మరుసటి రోజు తిరిగి వస్తారు. తరువాత 29న మంత్రివర్గంపై పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులతో చర్చ ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలోనే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని కొంతమందికి కెసిఆర్ బహిరంగ సభలోనే హామీ ఇచ్చారు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పలువురు ప్రముఖులు, అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన నివాసానికి వరుస కడుతున్నారు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పలువురు ప్రముఖులు, అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు. కెసిఆర్‌ను కల్సిన దర్శకులు శంకర్.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పలువురు ప్రముఖులు, అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పలువురు ప్రముఖులు, అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన నివాసానికి వరుస కడుతున్నారు.

కెసిఆర్
కెసిఆర్‌ను సిపిఐ నేతలు శనివారం ఆయన నివాసంలో కలిసి అభినందించారు. సిపిఐ నాయకులు కె నారాయణ, చాడా వెంకట రెడ్డితోపాటు ఇతర నేతలు తెలంగాణలో సాధారణ ఎన్నికల్లో విజయం సాధించినందుకు కేసీఆర్‌ను అభినందించారు. పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రలో కలవకుండా చూడాలని కోరుతూ న్యూ డెమోక్రసీ నేతలు కెసిఆర్‌కు శనివారం వినతిపత్రం అందించారు.












Click it and Unblock the Notifications