పోలవరం ముంపు గ్రామాలాపై సుప్రీంకు వెళ్తాం: కెసిఆర్

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాల్లో అత్యధిక గ్రామాలను ఆంధ్రాలో కలపాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించి, దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని యోచిస్తుండడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మండిపడుతున్నారు.

పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంపై తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

K Chandrasekhar Rao

కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశానని, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా హెచ్చరించానని, అయినా వారు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.

తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి రాజముద్ర వేసిన సిరా తడి ఆరకముందే తెలంగాణకు అన్యాయం జరిగేలా ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం బాధాకరమని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+