ఏపీలో గెలుపు ఎవరిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫలిస్తుందా..!
Recommended Video
ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నారని..అంటే తమకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లు అర్దం అవుతోందని టీడీపీ నేతలు అంతర్గత మీటింగ్‌ల్లో వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ ఏపీలో ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించారు. లోక్‌సభ సీట్లు ఎవరికి వస్తాయో కూడా విశ్లేషించారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ జోస్యం పైన చర్చ మొదలైంది..

ఏపీలో జగన్‌దే అధికారం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం చెన్నై వెళ్లారు.డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేవమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పైనా చర్చించారు. మద్దతు కోరారు. అదే సమయంలో ఏపీలో ఫలితాల మీద చర్చించారు. ఏపీలో జగన్ అధికారంలోకి వస్తున్నారని..120 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ తన అంచనాలను బయట పెట్టారు. ఆ సమయంలో స్టాలిన్ మాత్రం కేసీఆర్ అంచనాలతో విభేదించారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని ప్రశ్నించారు. బదులుగా కేసీఆర్ ఇది తన వద్ద అనేక సర్వే నివేదికలు ఉన్నాయని..అన్నింటినీ క్రోడికరించి వచ్చిన అంచనాలు అంటూ పోలింగ్ సరళిని వివరించారు. అదే సమయంలో ఏపీలోని 25 లోక్‌సభ స్థనాల మీద వారిద్దరి మధ్య చర్చ జరిగింది. ఏపీలో జగన్ 20 సీట్లకు పైగా లోక్‌సభ గెలుచుకుంటారని..తాము 15 సీట్లు తప్పక గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ చెబుతున్న లెక్కలతో ఒక్కసారిగా స్టాలిన్ విస్తుపోయారు.

టీడీపీ నేతల్లో అలజడి...
ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ నేతలు కొత్త అంశం తెర మీదకు తెచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని ప్రకటన చేస్తూనే..అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక, ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం ఏపీ ఫలితాల పైన ఎక్కడా స్పందించలేదు. అదే విధంగా..కేటీఆర్ సైతం ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారా అనే ప్రశ్నకు ఏపీలో రాజకీయాల పైన తనకు అంతగా ఆసక్తి లేదని సమాధానం ఇచ్చారు. దీంతో..వీరిద్దరూ జగన్ గెలుస్తారని గతంలో చెప్పిన విధంగా చెప్పక పోవటంతొ..జగన్ గెలుస్తారనే నమ్మకం కేసీఆర్..కేటీఆర్ కోల్పోయారని అందుకే గతంలో లాగా చెప్పటం లేదని టీడీపీ ముఖ్యులు అంచనా వేసారు. అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లు సైతం ఇదే అంశాన్ని వివరిస్తూ..తమ విజయానికి ఇంత కంటే సంకేతాలు ఏం కావాలని ప్రశ్నించారు.

కేసీఆర్ జోస్యం ఫలించేనా...
తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీలో ఎన్నికల ఫలితాల పైన చెబుతున్న జోస్యం ఎంత వరకు ఫలిస్తుందనే చర్చ ఇప్పుడు ఏపీలో మొదలైంది. కొంత కాలంగా కేసీఆర్...జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు ఓపెన్‌గానే ఆరోపణలు చేస్తున్నారు. కేసీరా్..మోదీ..జగన్ కలిసి తమ పైన కుట్రలు చేస్తున్నారంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆరోపించారు. ఇక, 2014 ఎన్నికల సమయంలోనూ జగన్ అధికారంలోకి వస్తారంటూ కేసీఆర్ చెప్పారని..అయితే, అది జరగలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తిరిగి ఇప్పుడు కూడా కేసీఆర్ అదే విధంగా జగన్ ఏపీలో అధికారంలోకి వస్తారని చెబుతున్నా..సాధ్యం కాదని చెబుతున్నారు. ఓటర్లు తమ వైపే ఉన్నారని.. పోలింగ్ సరళి తమకే అనుకూలంగా ఉందని వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications