జేజమ్మ దిగొచ్చినా: కేసీఆర్‌కు కోపమొచ్చింది (పిక్చర్స్)

హైదరాబాద్: విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోపించారు. రాజకీయంగా తమకు ఇబ్బంది కలిగిస్తోందని మండిపడ్డారు. తెరాస కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడి హోదాలో అధ్యక్షత వహించిన కేసీఆర్‌ సుమారు 2 గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు.

పార్టీ నాయకులకు దిశానిర్థేశం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు కష్టాలను ప్రస్తావిస్తూ.. దీని పరిష్కారానికి ఇప్పటికిప్పుడు ఏమీ చేసేటట్టు లేదన్నారు. విద్యుత్తు విషయంలో ఏపీ ప్రభుత్వం తొండి చేస్తోందని, అసలే సంక్షోభంలో ఉన్నామంటే, కావాలని ఇంకా ఇబ్బంది పెడుతోందని, దిగువ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టు నుంచి తెలంగాణకు పవర్‌ వచ్చేదని, మన పవర్‌ను మనకు కాకుండా చేసిన కర్కోటకుడు చంద్రబాబే అని దుయ్యబట్టారు.

కృష్ణపట్నం నుంచి విద్యుత్తు వస్తుందని అనుకున్నామని, దాని కోసం ఎదురుచూశాం.. కానీ అదీ రాకుండా చేశాడని, పీపీఏల నుంచి విద్యుత్తు వస్తుందని ఆశిస్తే దానిని రెండు వారాలు వాయిదా వేశాడని, కావాలనే ఏపీలోని టీడీపీ ప్రభుత్వం తెలంగాణను ఇబ్బంది పెడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయినా భయపడటం లేదని, వ్యవసాయరంగానికి విద్యుత్తు సరఫరా చేయాల్సిన ఆవశ్యకత దృష్ట్యా ఈ 15 రోజులు ఓపిక పట్టాలని పారిశ్రామికవేత్తలకు చెప్పామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

తనకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని, తలకాయ తెగినా నిజాలు చెబుతానని, ఎన్నికల సమయంలో 107 సభల్లో పాల్గొంటే, 86 చోట్ల రాబోయే మూడేళ్లపాటు విద్యుత్తు కష్టాలు తప్పవని చెప్పానని కేసీఆర్ తెలిపారు. కరెంట్‌ కోతలపై తానే కాదు.. తన తాత జేజమ్మ దిగి వచ్చినా ఏమీ చేయలేడన్నారు. అయితే ఒక్కో ఏడాది గడుస్తుంటే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా మెరుగుపడుతుందని, వచ్చే సంవత్సరం ఆదిలాబాద్‌ జిల్లాలోని పవర్‌ ప్లాంట్‌ నుంచి కొంత పవర్‌ జమ అవుతుందన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

భూపాలపల్లి విద్యుత్తు కేంద్రం నుంచి 600 మెగావాట్లు వస్తుందని, కేంద్రం నుంచి 230 మెగావాట్లు రానుందని, వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే 2,500 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని, ఒక సంవత్సరం గడిస్తే విద్యుత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, చంద్రబాబు బ్లాక్‌ మెయిల్‌ నడవదని, వాళ్లు ఏం సతాయించినా మరో మూణ్ణాలుగు నెలలు అంతే అన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

కొత్త విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు దసరా నాడు ఒప్పందాలు జరిగాయని, వేగంగా పనులు చేయాలని కోరామని, మూడేళ్ల తర్వాత కనురెప్ప వేసే కాలం కూడా విద్యుత్తు సరఫరా నిలిచిపోదని, విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఇండియాలోనే నెంబర్‌ వన్‌గా నిలుస్తుందని, తన తల తాకట్టు పెట్టి అయినా దీనిని సాధించి తీరుతానని కేసీఆర్ అన్నారు. ఈ నిజాలను ప్రజలకు ధైర్యంగా చెప్పాలని, డంబాచారం అక్కర్లేదని పార్టీ నేతలకు సూచించారు. విద్యుత్తు సమస్యపై కొన్ని పార్టీల వాళ్లు ఇంగితజ్ఞానం లేకుండా అర్థరహితంగా మాట్లాడుతున్నారన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

కరెంట్‌ సమస్యకు ఎవరు కారణం, నిజమైన బాధ్యులు కాంగ్రెస్ వాళ్లు కాదా అని ప్రశ్నించారు. వాళ్లు పదేళ్లలో చేయలేనిది.. మూడు నెలల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంతా మాయం చేయాలా? అల్లావుద్దీన్‌ అద్భుత దీపాన్ని సృష్టించాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విషయంలో విపక్షాలు దిక్కుమాలిన అసహన వైఖరి, విపరీతమైన పెడధోరణితో వెళ్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన మూడో రోజే తమ పార్టీ జెండా గద్దెలను కూల్చారని, తన దిష్టిబొమ్మలను దహనం చేశారని మండిపడ్డారు. అనాలోచితంగా ఏం చేసినా నష్టమే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+