12 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టిన కెసిఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సరిగ్గా 12 ఏళ్ల తరువాత శాసన సభలోకి అడుగు పెట్టారు. 2004 వరకు శాసన సభ్యునిగా ఉన్న కెసిఆర్ ఆ ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేశారు. 1999లో మంత్రివర్గంలో స్థానం లభించలేదు, డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

2001లో టిడిపి పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరఫున విజయం సాధించి సభలో అడుగు పెట్టారు. 2004 వరకు సభలో టిఆర్‌ఎస్ తరఫున తెలంగాణ వాణిని వినిపించింది ఆయన ఒక్కరే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు.

KCR enters assembly after 12 years

2004లో కరీంనగర్ నుంచి, ఉప ఎన్నికల్లో అదే నియోజక వర్గం నుంచి విజయం సాధించిన కెసిఆర్ 2009లో మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు రెండింటికి పోటీ చేసి, ఎంపి సీటుకు రాజీనామా చేశారు. 2004 అసెంబ్లీ చివరి సమావేశాల కోసం అసెంబ్లీకి వచ్చిన కెసిఆర్ ఆ తరువాత పదేళ్లు అసెంబ్లీకి రాలేదు.

సోమవారంనాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభా సమావేశాలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ సభలో అడుగు పెట్టారు. సొంత రాష్ట్రం సాధించుకుని అధికారంలోకి వచ్చిన తెరాస ఉత్సాహంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+