పిచ్చి రాతలు వద్దు: మీడియాపై కెసిఆర్ మండిపాటు
హైదరాబాద్: మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మండిపడ్డారు. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే కోసం శుక్రవారం ఉదయం హెచ్ఐసీసీలో జరిగిన సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను డమ్మీ చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా హద్దుల్లో ఉండాలన్నారు. ఇప్పటికీ కొన్ని మీడియా సాధనాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని భావిస్తున్నాయని, అలాంటి సాధనాలతో వారేమీ చేయలేరని కేసీఆర్ అన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఆయన అన్నారు. త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్రిక తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ విద్యార్థులకే మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, పొరుగు రాష్ట్రాల వారికి చెల్లించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే కోసం హెచ్ఐసీసీలో శుక్రవారం ఉదయం జరిగిన సన్నాహక సదస్సులో చెప్పారు.
ఫీ రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం ఎంతో ఒత్తిని ఎదుర్కుంటోందన్నారు. అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామని ఆయన చెప్పారు. విద్యార్థుల స్థానికతను ధృవీకరించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పు ఇచ్చాయని కెసిఆర్ గుర్తుచేశారు. ఫీ రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆందోళన అవసరంలేదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications