Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబుపై కేసుకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్?: ఫోన్ ట్యాప్ చేయలేదన్న ఖాన్

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు వైపు ఢిల్లీ వెళ్లగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటు హైదరాబాదులో ఎసిబి జెడి ఎకె ఖాన్, ఇంటలిజెన్స్ శివధర్ రెడ్డితో మంగళవారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఓటుకు నోటు కేసుపై కెసిఆర్ వారి సమావేశం అత్యంత కీలకమైందని భావిస్తున్నారు.

చంద్రబాబుపై కేసు నమోదుకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దాంతో చంద్రబాబుకు ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ చేయవచ్చునని అంటున్నారు. చంద్రబాబు ఢిల్లీ పయనంపై కూడా ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

KCR - Chandrabau

అదలా ఉండగా, ఓటుకు నోటు కుంభకోణంలో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తుందంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికార మీడియాగా భావించే నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. చంద్రబాబును నిందితుడిగా చేర్చి విచారించేందుకు అవసరమైన ఆధారాలను ఏసీబీ సేకరించిందంటూ ఆ మీడియా రాసింది. చంద్రబాబుకు, రేవంత్‌కు ఈ కేసులో కామన్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేందుకు పూర్తిస్థాయిలో ఆధారాలు సంపాధించిందని, తర్వలోనే పక్కా ఆధారాలతో చంద్రబాబు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉందని రాసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీపై ఏసీబీ పరిశీలిస్తోందని వ్యాఖ్యానించింది.

చంద్రబాబు స్టేట్‌మెంట్‌ను ఎసిబి రికార్డు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 129బీ కింద నేరపూరిత కుట్రకు రూపకల్పన చేశారనే ఆరోపణతో బాబుపై కేసు పెట్టే అవకాశం ఉందని నమస్తే తెలంగాణ మీడియా రాసింది. ఏసీబీ ఆపరేషన్‌లోని వీడియో, ఆడియో క్లిప్‌లే కీలక సాక్ష్యాధారాలనిస అభియోగాలను నిరూపించేందుకు ఈ క్లిప్‌లే కీలకమని న్యాయనిపుణులు అంటున్నారంటూ ముక్కాయింపు ఇచ్చింది.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా తాము ఎవరి ఫోను ట్యాప్ చేయలేదని అవినీతి నిరోధక శాఖ డీజీ ఏకే ఖాన్ తెలిపారు. ఫోన్ ట్యాపింక్ ఆరోపణలు నిరాధారమన్నారు. కేసులో ఏదైనా చట్టానికి లోబడే ఏసీబీ విచారణ జరుతుందని చెప్పారు. తెలంగాణ ఎసిబి పూర్తిగా వృత్తి నిబద్ధత గల కలిగిన దర్యాప్తు సంస్థ అని ఆయన అన్నారు.

కాగా, చంద్రబాబు నాయుడు రేపు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులను కలుసుకుంటారు. ఆయన భేటీలు మంగళవారం సాయంత్రం ఖరారయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+