వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయం లేకుండా, నన్నే కలవొచ్చు: కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నేరుగా తననే కలువవచ్చునని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం చెప్పారు. నానక్ రాంగూడలో వేవ్ రాక్ ఐటీ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పెట్టుబడిదారులకు సింగిల్ విండో విధానం ఏర్పాటు చేస్తామన్నారు.

బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడిదారులు కార్యాలయాల చుట్టు తిరగవలసిన పని లేదన్నారు. ఒక్క దరఖాస్తు ఇస్తే అధికారులే అంతా చూసుకుంటారని చెప్పారు. స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవచ్చునని చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

పెట్టుబడిదారులకు భయం లేకుండా తమ ప్రభుత్వం విధానం ఉంటుందని చెప్పారు. హైదరాబాదును అంతర్జాతీయంగా తీర్చి దిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాదును డిజిటల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఐటీ రంగానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

ప్రతి వ్యక్తికి హైదరాబాదులో సెక్యూరిటీ ఉండేలా లా అండ్ ఆర్డర్ తీర్చిదిద్దుతామని చెప్పారు. పరిశ్రమల కోసం సింగిల్ విండో విధానం ఏర్పాటు చేస్తామన్నరు. పౌర భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలతో చర్యలు తీసుకుంటామన్నారు. పెట్టుబడిదారులకు అవినీతి బెడద లేకుండా చూస్తామన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలో వేవ్ రాక్ ఐటీ పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్

కేసీఆర్

హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలో వేవ్ రాక్ ఐటీ పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు.

హాజరైన ప్రముఖులు

హాజరైన ప్రముఖులు

హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలో వేవ్ రాక్ ఐటీ పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. హాజరైన ప్రముఖులు.

కేసీఆర్

కేసీఆర్

ఐటీ పార్క్ ప్రారంభం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నేరుగా తననే కలువవచ్చునని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ నిర్మాణమే తమ లక్ష్యమని, పెట్టుబడిదారులు కార్యాలయాల చుట్టు తిరగవలసిన పని లేదని, ఒక్క దరఖాస్తు ఇస్తే అధికారులే అంతా చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు.

కేటీఆర్

కేటీఆర్

హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలో వేవ్ రాక్ ఐటీ పార్క్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐటీ మంత్రి కేటీఆర్.

English summary
Telangana Chief Minister KCR inaugurates Wave Rock Park in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X