మరోసారి ఆంధ్రాలో అడుగుపెట్టనున్న కేసీఆర్!?: ఆసక్తిగా చూస్తోన్న జనం..

రోసారి ఆయన ఆంధ్రాలో అడుగుపెట్టే సందర్భం రావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు పెళ్లికి కేసీఆర్ హాజరైతే..

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆంధ్రాలో అడుగుపెడుతున్నారంటే.. ఆటోమేటిగ్గా ఆ విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలు విడిపోవడం.. ఇటీవల కేసీఆర్ పాలనను అభినందిస్తూ ఆంధ్రాలోను పార్టీ పెట్టాలంటూ వినతులు వస్తున్న నేపథ్యంలో.. ఆయన ఆంధ్రాలో పర్యటించబోతున్నారంటే దానికి మరింత ప్రాధాన్యం ఏర్పడటం ఖాయం.

అటు మీడియా, ఇటు జనం అదే పనిగా ఆ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. త్వరలోనే ఆయన విశాఖపట్నంలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం జూన్ 15న జరగనున్నందునా... ఇందుకోసం ఆయనకు ఆహ్వానం అందింది.

KCR Invited to attend Rammohan Naidu's wedding in AP, is he attends?

ఈ మేరకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయనకు కాబోయే మామ, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణతో కలిసి సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన సంగతి తెలిసిందే. సత్యనారాయణ కుమార్తె శ్రావ్యతో రామ్మోహన్ నాయుడు వివాహం జరగనుంది. పెళ్లికి ఆహ్వానం అందిన నేపథ్యంలో.. కేసీఆర్ ఈ వివాహానికి హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అప్పట్లో కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన సందర్భంలో.. అక్కడి ప్రజల నుంచి హర్షం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన ఆంధ్రాలో అడుగుపెట్టే సందర్భం రావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు పెళ్లికి కేసీఆర్ హాజరైతే.. ఆయనే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఉండే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+