వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాను హైదరాబాద్ పిలిచిన కెసిఆర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాద్‌కు అహ్వానించారు. శుక్రవారం ఆయన ఈ ఆహ్వానం పలికారు. భారత పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్‌కు రావాలని ఆయన ఒబామాకు ఆహ్వానం పలికారు.

తనను శుక్రవారం కలిసిన అమెరికా ప్రతినిధి బృందానికి తాను ఒబామాను హైదరాబాదు రావాలని అహ్వానిస్తున్నట్లు చెప్పారు. అరుణ్ ఎం కుమార్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం కెసిఆర్‌ను కలిసింది.

అవినీతి అణుమాత్రం కూడా లేని పారిశ్రామిక విధానంతో ముందుకు వస్తామని కెసిఆర్ అమెరికా ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హయాంలో అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.

అమెరికా ప్రతినిధి బృందంతో కెసిఆర్

అమెరికా ప్రతినిధి బృందంతో కెసిఆర్

అరుణ్ ఎం కుమార్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు.

ఇలా స్వాగతం

ఇలా స్వాగతం

అమెరికా ప్రతినిధి బృందానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సాదర ఆహ్వానం పలికారు.

బియాస్ మృతుల కుటుంబాలు

బియాస్ మృతుల కుటుంబాలు

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది ప్రమాద ఘటనలో మరణించినవారి కుటుంబాల సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు.

నాయనితో సహా..

నాయనితో సహా..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది ప్రమాద ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబ సభ్యులు కెసిఆర్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి కూడా ఉన్నారు.

English summary

 Telangana chief minister K Chandrasekhar Rao on Friday invited US President Barack Obama to visit Hyderabad when he visits India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X