కెసిఆర్ తెలంగాణ జాతిపిత, టి వద్దని గతంలో...: సురేఖ

హైదరాబాద్: కెసిఆర్ తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ సాధనకు పద్నాలుగేళ్ల పాటు నిరంతరం కృషి చేసినందు వల్లనే నాలుగున్నర కోట్ల మంది ప్రజలు తెరాసకు పట్టం కట్టారని ఆ పార్టీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. గురువారం ఆమె తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై తొలుత ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

గత ప్రభుత్వ దమనకాండకు బలైన తెలంగాణను బంగారు తెలంగాణకు ఆవిష్కరించే శక్తిసామర్ధ్యాలు కెసిఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ పదం ఉండేది కాదని, తెలంగాణ అనే పదాన్ని ఉచ్ఛరించరాదని ఒక ముఖ్యమంత్రి గతంలో అన్నారని కూడా చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. వివక్షతో విద్రోహుల వల్ల అణగారిన తెలంగాణ అభివృద్ధి తమ ప్రభుత్వం వల్లనే సాధ్యమన్నారు.

KCR is Telangana Jathipitha: Konda Surekha

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అధికార పక్షానికి విపక్షాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని శాసన మండలిలో పాతూరి సుధాకర్ రెడ్డి కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సుధాకర్ రెడ్డి ప్రతిపాదించగా, కె స్వామిగౌడ్ బలపరిచారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాన్ని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారన్నారు.

అభినందిస్తాం: రెడ్యానాయక్

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభిస్తుందని ఎన్నికల సమయంలో తెరాస ప్రచారం చేసిందని, కానీ ఎన్నికల ప్రణాళికలో, గవర్నర్ ప్రసంగంలో ఆ అంశం చేర్చలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+