హైద్రాబాద్‌పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి, అక్రమాలపై కఠినంగా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ వంటిదని, రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముక అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో 'నవ తెలంగాణ సమాలోచన' పేరిట విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు.
హైదరాబాదు నగరాన్ని ఇంతకు మూడంతలు విస్తరిస్తామని కేసీఆర్ చెప్పారు. రాజధానిలో ఇంకో రెండు విమానాశ్రయాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంల ఐటీఐఆర్ అభివృద్ధి కావాలన్నారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దుతామని చెప్పారు.
హైదరాబాదులో 58వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. అక్రమ కట్టడాల పైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాజకీయ అవినీతికి తావు లేదన్నారు. బంధువులైనా, పిల్లలైనా తప్పు చేస్తే సహించే ప్రసక్తి లేదని చెప్పారు. అక్రమార్కులను జైలుకు పంపిస్తామన్నారు. విద్యుత్ కొనుగోలుకు, ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పారు.

జిల్లాల్లో అవసరమైతే జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ప్రతి జిల్లాలో స్మృతి వనాలు, డంపింగ్ యార్డులు ఉండాలన్నారు. వ్యవసాయాన్ని అధ్యయనం చేసేందుకు ఇజ్రాయెల్‌కు బృందాన్ని పంపిస్తామన్నారు.
గ్రామాల్లో శ్రమదానం చేద్దామని పిలుపునిచ్చారు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. తెలంగాణలో విద్యుత్ కోత ఉందని చెప్పారు. రానున్న మూడేళ్లలో రెండు కోట్ల ముప్పై లక్షల మొక్కలు నాటాలన్నారు. ప్రతి జిల్లాల్లో లక్ష మొక్కలు నాటాలన్నారు.












Click it and Unblock the Notifications