మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెదక్ తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:మెదక్ లోకసభ సీటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారం మధ్యాహ్నం పార్టీ సీనియర్ నేత కె. కేశవరావుతో సమావేశమై అభ్యర్థిని ఖరారు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి రేపు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేస్తారు.

మెదక్ పార్లమెంటు సీటు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గెలుపు మాత్రమే కాకుండా భారీ మెజారిటీపై దృష్టి పెట్టాలని ఆయన మెదక్ జిల్లా పార్టీ నాయకులకు ఆయన సూచించారు. సోమవారం సాయంత్రం గంటకు పైగా సాగిన మెదక్ జిల్లా పార్టీ సమావేశంలో అభ్యర్థి ఎంపికపై చర్చించారు.

అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను కెసిఆర్‌కు పార్టీ నాయకులు అప్పగించారు. ఆయన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో చర్చించి, అభ్యర్థిని ఖరారు చేశారు. కాగా, బిజెపి, కాంగ్రెసు అభ్యర్థులు ఖరారైన తర్వాతనే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు భావించినప్పటికీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు.

మెదక్ పార్లమెంటు సీటు టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. టిఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, సోని ట్రావెల్స్ యజమాని కొత్త ప్రభాకర్ రెడ్డి, పార్టీ మెదక్ జిల్లా ఆధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పేర్లను సోమవారంనాటి సమావేశంలో పరిశీలించారు. అయితే చివరకు కెసిఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డివైపే మొగ్గు చూపారు.

మెదక్ సీటుపై చర్చ

మెదక్ సీటుపై చర్చ

మెదక్ లోకసభ ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస అభ్యర్థిని ఖరారు చేయడానికి కెసిఆర్ మెదక్ జిల్లా పార్టీ నాయకులతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.

మెదక్ సీటుపై చర్చ

మెదక్ సీటుపై చర్చ

మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీకి ఒక్కో మంత్రిని ఇంచార్జీగా నియమించి, భారీ మెజారిటీ సాధించాలనే వ్యూహంతో కెసిఆర్ ఉన్నారు.

మెదక్ సీటుపై చర్చ

మెదక్ సీటుపై చర్చ

మెదక్ లోకసభ స్థానాన్ని టిఎన్జీవో నాయకుడు దేవీప్రసాద్ మొదటి నుంచీ ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌కు వెన్నుదన్నుగా ఆయన నిలిచారు.

జోగు రామన్న అభినందన

జోగు రామన్న అభినందన

సింగపూర్ పర్యటనను ముగించుకుని వచ్చిన తెలంగాణ ఎంసి కెసిఆర్‌ను సోమవారంనాడు మంత్రి జోగు రామన్న అభివనందించారు.

English summary
It is said that Telangana Rastra Samithi (TRS) president and Telangana CM K Chandrasekhar Rao may announce his candidate for Medak MP seat after candidates of BJP and Congress finalised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X