వెంకయ్య కేంద్రమంత్రిగా ఉండటం అదృష్టం: కెసిఆర్, టీకి సానుకూలమని..
న్యూఢిల్లీ: వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉండటం.. తెలుగు రాష్ట్రాల అదృష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కొనియాడారు. కేంద్రం సానుకూలంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారమందిస్తుందని అన్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు పలు అంశాలపై చర్చించిన అనంతరం సిఎం కెసిఆర్, వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు.
హౌసింగ్, పట్టణ రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, స్మార్ట్ సిటీలు, హైదరాబాద్ అభివృద్ధి, స్వచ్ఛ భారత్ లాంటి అంశాలపై చర్చించామని సిఎం కెసిఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తమ సహకారమందిస్తామన్నారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సహకారమందిస్తుందనే విశ్వాసం ఉందని చెప్పారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపాదనలు పంపించామన్నారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ఉన్నాయని అన్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధిపై సానుకూలంగా ఉందని వెంకయ్యనాయుడు చెప్పారు. వాటర్ గ్రిడ్‌కు ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా సహకరిస్తుందని తెలిపారు.
వెనబడిన జిల్లాలపై కూడా చర్చించినట్లు తెలిపారు.
వచ్చే బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. కాగా, నీతి అయోగ్ సమావేశంలో కేంద్రానికి అనుకూలంగా సిఎం కెసిఆర్ ముందుకెళ్లారు. మూడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న కెసిఆర్.. సోమవారం సాయంత్రం హైదరాబాద్ బయల్దేరనున్నారు.












Click it and Unblock the Notifications