పావులు కదిపిన KCR... పక్కా పొలిటికల్ స్కెచ్?

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించడం వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రణాళిక ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన శాంతికుమారి బీఆర్కే భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. 2025 ఏప్రిల్ వరకు ఆమె పదవీకాలం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె మెదక్ కలెక్టర్ గా పనిచేశారు.

చకచకా పావులు కదిపిన కేసీఆర్

చకచకా పావులు కదిపిన కేసీఆర్

రాజకీయ వ్యూహాల్లో గండర గండడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ సోమేష్ కుమార్ నియామకంపై తీర్పు రావడంతో చకచకా పావులు కదిపారు. ఇటీవలే ఏపీలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ తోపాటు మరికొందరు కాపు నాయకులను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో కాపుల ఓటుబ్యాంకుపై కేసీఆర్ దృష్టిపెట్టారని వార్తలు వచ్చాయి. తాజాగా సీఎస్ గా నియమితులైన శాంతి కుమారి కూడా కాపు సామాజికవర్గాని చెందినవారే కావడం విశేషం.

శాంతికుమారిది కృష్ణా జిల్లా

శాంతికుమారిది కృష్ణా జిల్లా


భారత రాష్ట్ర సమితిని జాతీయ రాజకీయాల్లో విస్తరింపచేసి దేశవ్యాప్తంగా సత్తా చాటాలని కేసీఆర్ చూస్తున్నారు. జాతీయ పార్టీ హోదా సాధించే క్రమంలో అవసరమైన ఓట్ల శాతం తెచ్చుకునేందుకు ఆయన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రపై దృష్టిపెట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన శాంతికుమారిని చీఫ్ సెక్రటరీగా నియమించినందుకు బీఆర్ ఎస్ ఏపీ కాపు నాయకులు కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ బహిరంగసభ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీలో బలోపేతమయ్యే చర్యల్లో భాగంగానే శాంతికుమారి వైపు కేసీఆర్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

కాపు ఓటుబ్యాంకు కోసం..

కాపు ఓటుబ్యాంకు కోసం..

ఏపీలో కాపు సామాజికవర్గానికి మరింత చేరువయ్యేందుకు సీఎస్ ఎంపిక ఉపయోగపడుతుందని, రానున్న ఎన్నికల్లో అనుకున్న సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోవడానికి శాంతికుమారి ఎంపికను కేసీఆర్ పునాదిగా చేసుకున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆమెను సీఎస్ గా ఎంపిక చేయడంపై ఏపీలోని కాపు వర్గం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అలాగే కాపులకు చేరువయ్యేందుకు మరిన్ని చర్యలు చేపడితే కాపు ఓటుబ్యాంకు బీఆర్ఎస్ కు స్థిరంగా ఉండిపోతుందనేది కేసీఆర్ భావనగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+