కెసిఆర్ పిలువలేదు, అందుకే: అశోక్ గజపతి రాజు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనను ఇప్పటి వరకు ఆహ్వానించలేదని, అందుకే తాను ఇప్పటి వరకు కెసిఆర్‌ను కలుసుకోలేదని కేంద్ర పౌర విమానయానాల మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పి. అశోక్ గజపతి రాజు అన్నారు.
కెసిఆర్‌తో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన చెప్పారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తే విమానాశ్రయాలకు ఎన్టీ రామారావు పేరు పెట్టే విషయం ఆలోచిస్తామని ఆయన చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీ రామారావు పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ కావడం సంతోషకరమైన పరిణామమని కేంద్ర మంత్రి పి. అశోక్ గజపతి రాజు అన్నారు. శనివారం ఉదయం ఆయన లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టుపై తాము ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశామని, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యలను పరిష్కరించుకోవాలని రాజ్‌నాథ్ సూచించారని ఆయన చెప్పారు. తెలుగువారికి మంచి జరిగితే మరింత సంతోషిస్తానని అశోక్ గజపతి రాజు అన్నారు.












Click it and Unblock the Notifications