మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ నుండి వచ్చిన దరిద్రం ఉంది, తల తెగినా: కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన దరిద్రం చాలా ఉందని, అందుకోసం ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. మెదక్ లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చట్టాలు మార్చాల్సి ఉందన్నారు. తాను చేయగలిగిందే చెబుతానని, తలతెగినా వెనక్కి పోనని చెప్పారు.

తెలంగాణకు కొత్త చట్టాలు తయారు చేసుకోవాల్సిన అవసరముందని, అన్నింటి పైన అధ్యయనం చేస్తున్నామన్నారు. రుణమాఫీని తామే చేయాలన్నారు. పొన్నాల లక్ష్మయ్యో.. మరొకరో చేసేందుకు వారు పవర్లో లేరన్నారు. 2001లో తాను తెలంగాణ సాధన కోసం ముందుకు వస్తే ఎందరో విమర్శించారని, మానసికంగా కృంగదీసే ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణ వస్తుందా అని విమర్శలు చేశారని కానీ, ప్రజల అండతో ముందుకెళ్లి తెలంగాణ సాధించామన్నారు.

ఈ వంద రోజుల పాలనలో కాంగ్రెసు పార్టీ ఉండి ఉంటే కోట్లు మింగేదన్నారు. దసరా పండుగ నుండి కార్యక్రమాలన్నింటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. టీడీపీ, కాంగ్రెసు పార్టీ హయాంలో రూ.200 మాత్రమే పింఛన్ ఇచ్చారని, తాము మాత్రం వెయ్యికి పైగా ఇస్తామన్నారు. ఇప్పటికే పలు హామీలు నెరవేర్చామన్నారు. మెదక్ లోకసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపిస్తే అద్భుతంగా పాలిస్తామన్నారు.

 KCR participated in Medak bypolls campaign

తాను చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తానన్నారు. తనకు వ్యవసాయం ఉందని, రుణమాఫీపై మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. చేయగలిగిందే తాను చెబుతానన్నారు. రుణమాఫీకి రిజర్వే బ్యాంక్ అనుమతివ్వడం లేదని, అయితే, అందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. మరోసారి రిజర్వ్ బ్యాంకును రుణమాఫీపై కోరుతున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతోందన్నారు. రానున్న కాలంలో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. దేశం ముక్కున వేలేసుకునే విధంగా తెలంగాణను నిలబెడతానన్నారు.

తెరాస హయాంలో 146 మంది రైతులు ఆత్మహత్య చనిపోయినట్లుగా పొన్నాల చెబుతున్నారని, కానీ, ఈ పాపం పదేళ్ల కాంగ్రెసు పాలన పాపమే అన్నారు. అరవయ్యేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ చేసిన పాపం సర్దుబాటు చేసేందుకు ఎంత సమయం కావాలన్నారు. రైతుల ఆత్మహత్యకు ఎవరి బాధ్యతో చెప్పాలన్నారు. తాము ఇప్పుడే వచ్చామని, ఇంకా పని ప్రారంభించలేదని, బడ్జెట్ సమావేశాల తర్వాత చేస్తామన్నారు.

బట్టలు మార్చుకునేందుకు కూడా వీలు లేకుండా చిన్న డబ్బా ఇళ్లను గత ప్రభుత్వాలు ఇచ్చాయని, తాము బెడ్ రూంతో మంచి ఇళ్లు కట్టిస్తామన్నారు. సిద్దిపేటలో ఉన్నట్లుగా ప్రతి ఇంటిలో నల్లా ఉండేట్టు చూస్తామన్నారు. సమగ్ర సర్వే పైన పార్టీలు ప్రశ్నించాయని, కానీ ప్రజలు మాత్రం అందులో పాల్గొన్నారన్నారు. గతంలో జరిగిన ఇళ్ల అక్రమాల పైన విచారణ జరుగుతోందన్నారు. అది పూర్తయ్యాక కొత్త ఇళ్లు కట్టిస్తామన్నారు.

విద్యుత్ విషయాన్ని తాను ఎప్పుడు దాచి పెట్టలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలన వల్ల విద్యుత్ కష్టాలు వచ్చాయని, మూడేళ్ల తర్వాత ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తామని, ఇది కేసీఆర్ మాట అని, దానిని చేస్తానన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఆలస్యానికి కాంగ్రెసు పార్టీ చేసిన దొంగ పనులే అడ్డంగా ఉన్నాయన్నారు. ఇళ్లను హడావుడిగా కట్టిస్తే అవకతవకలు చేసేందుకు దొంగలు కాపు కాసుకొని కూర్చున్నారని, అందుకే ఆదరాబాదరా చేపట్టనని చెప్పారు.

బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?

బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని నిలబెట్టి బీజేపీ తన పరువు తీసుకుందన్నారు. బీజేపీలో జగ్గారెడ్డి తప్ప అభ్యర్థులే లేరా అన్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునితా లక్ష్మా రెడ్డిలను అసెంబ్లీలో ప్రజలు తిరస్కరించారన్నారు. అసెంబ్లీలో చెల్లని రూపాయి పార్లమెంటులో ఎలా చెల్లుతుందన్నారు. తాను మెదక్ బిడ్డనని, ఇక్కడ మెజార్టీ రాకుండా ముఖ్యమంత్రి జిల్లాలోనే తక్కువ మెజార్టీ వచ్చిందని విమర్శిస్తారని, అందుకే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao participated in Medak bypolls campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X