వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యాన్స్‌పై లాఠీఛార్జ్, కోపంతో ఊగిపోయిన పవన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతమంటే గౌరవమని, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు భయపడనని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం ఆయన రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల్లో బిజెపి, టిడిపి కూటమికి ప్రచారం నిర్వహించారు.

ఫ్లోరైడ్ లేని నల్గొండ, వలసలు లేని పాలమూరు, చేనేత చావుల్లేని సిరిసిల్లా.. వంటి మాటలను కెసిఆర్ నోట వినాలని తన కోరిక అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ విపక్ష నేతల పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పవన్ పైవిధంగా అన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెరాస నాయకులు సన్నాసి అని వెనుకబడిన వర్గానికి చెందిన ప్రధాని కాబోతున్న మోడని పదే పదే తిడుతూ ఉంటే బాధ కలిగిందని, ఆవేశం వచ్చి ప్రశ్నించానన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ సాయుధ పోరాటాన్ని చదివి వచ్చానని, అదే స్ఫూర్తితో అన్యాయం, అక్రమాలపై పోరాడే ధైర్యం వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఎవరు అన్యాయానికి పాల్పడినా.. దౌర్జన్యానికి దిగినా వారి తాట తీస్తానని హెచ్చరించారు. రాయి విసిరితే వెరవం.. బెదిరిస్తే భయపడమన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలిస్తే సహించం.. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని, బిసి నేత మోడీని విమర్శిస్తే అంతు చూస్తామన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తాను ఎన్నడూ తెలంగాణకు అడ్డు చెప్పలేదని, తనకు తెలంగాణ అంటే గౌరవం.. ఇష్టమని ప్రకటించారు. తెరాస నేత తిట్లకు భయపడతానని అనుకుంటున్నారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యతతో మాట్లాడాలని హితవు పలికారు. తనను తిట్టినవాళ్ల పని పడతానని, మనలో నిజాయితీ ఉన్నంతవరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

అన్యాయం ఎక్కడ జరిగినా, చివరకు పాకిస్తాన్‌లో జరిగినా పోరాడుతానని చెప్పారు. ప్రజల కోసం పోరాటం చేసే సత్తా తనకు ఉందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

రాజకీయమంటే రెండున్నర గంటల సినిమా కాదని, లీడర్ సినిమా అంతకన్నా కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తన మీద దాడులు చేస్తారనే భయం లేదని, జనం కోసం పోరాటం చేస్తానని చెప్పారు. అవసరమైతే సినిమాలను వదిలేసి ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తా.. మీ ఆనందం కోసం అవసరమైతే సినిమాలూ తీస్తానన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల ప్రజల అభివృద్ధే జన సేన లక్ష్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజల్లో విద్వేషాలను పెంచి పోషిస్తున్న తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

నటకాచ నేతల మాటలు చేటు తెస్తున్నాయని, వారు బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. బంగారు తెలంగాణ కోసం జనసేన అహర్నిశలూ కృషి చేస్తుందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఈ ప్రాంతం అభివృద్ధి కోసం జైలు కెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తనను తిడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

భయపెట్టాలని చూస్తున్నారని, అయినా సహనంతో ఉంటున్నానని, ఇది అసమర్ధత కాదని, ఎవ్వరికీ భయపడనని, తిడితే భరిస్తానని, హద్దు మీరితే పని పడతానని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

కాగా, పవన్ కళ్యాణ్ రాకముందు అమీర్‌పేటలోని సభాస్థలి వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. నిర్వాహకులు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ రాక ఆలస్యం కావడంతో ఎనిమిది గంటల ప్రాంతంలో తోపులాట జరిగింది. అభిమానులు వేదిక పైకి చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీచార్జి చేశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ ప్రాంతమంటే గౌరవమని, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు భయపడనని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం ఆయన రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల్లో బిజెపి, టిడిపి కూటమికి ప్రచారం నిర్వహించారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఫ్లోరైడ్ లేని నల్గొండ, వలసలు లేని పాలమూరు, చేనేత చావుల్లేని సిరిసిల్లా.. వంటి మాటలను కెసిఆర్ నోట వినాలని తన కోరిక అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ విపక్ష నేతల పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పవన్ పైవిధంగా అన్నారు.

English summary
TRS chief K Chandrasekhara Rao’s latest battle is against Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X