నాగార్జునని టార్గెట్‌చేసిన కెసిఆర్, త్రీడి ప్రచారం(పిక్చర్స్)

హైదరాబాద్: తెరాస అధికారంలోకి వచ్చాక చంద్రబాబు బంధువులు, వైయస్ బంధువులతో పాటు సినీ హీరో నాగార్జున హైదరాబాద్‌లో అక్రమించిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని కెసిఆర్ హెచ్చరించారు.

చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు పేరుతో జిల్లా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడం తప్ప ప్రాణహిత గురించి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్, టిడిపి నాయకుల మాటలను ఎవ్వరూ నమ్మరాదని మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని జూరాల ప్రాజెక్టు ద్వారా మరో నాగార్జునసాగర్‌లా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెరాస అధికారంలోకి వస్తే హైదరాబాదును వరల్ట్ క్లాస్ సిటీగా మారుస్తామని, ఐటిఐఆర్ ద్వారా యాభై లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

జూరాల ప్రాజెక్టును 670 మీటర్ల ఎత్తుపెంచితే 752 కి.మీ కాలువద్వారా నీరు పంపించే అవకాశం వుందని కెసిఆర్ అన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తాగునీరు, సాగునీరు పుష్కలంగా అందించవచ్చని ఆయన తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

శంకరపల్లిలో 41వేల మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రైతులకు వ్యవసాయ రంగానికి అందిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని లంబాడీలకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రభుత్వ భూములను అన్యాక్రాంతంకాకుండా చూస్తామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అమెరికా, చైనా దేశాల నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు వరల్డ్‌హబ్ పేరుతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఏర్పాట్లు చేస్తున్నట్లు కెసిఆర్ స్పష్టం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ రెండు జిల్లాల్లో రెండింతలు అభివృద్ధి జరుగుతుందని ఆ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు మరో విమానాశ్రయం అవసరం వస్తుందని ఆయన అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు చేసుకోకుండా అడ్డువస్తున్న 111 జివోను రద్దుచేస్తామని, అలాగే మహిళలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఎంత ముఖ్యమో ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించడం అంత ముఖ్యమని ఆయన అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ప్రాంతంలో అన్ని సీట్లను కైవసం చేసుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కెసిఆర్ సభకు జిల్లాలోని పలు ప్రాంతాలనుండి భారీ సంఖ్యలోనే జనం హాజరయ్యారు.

కెసిఆర్

కెసిఆర్

టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ అధినేత కెసిఆర్ అన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కెసిఆర్ శనివారం పలు సమావేశాల్లో పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

లోతుకుంటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. సెటిలర్లతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, వారు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

అయితే సచివాలయంలో చక్రం తిప్పితే సహించేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు చీకట్లో చేతులు కలిపి తెలంగాణకు ద్రోహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కెసిఆర్

కెసిఆర్

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు, జగన్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డికి తెలంగాణతో ఏమి పని అని ప్రశ్నించారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కెసిఆర్ ప్రచారాన్ని త్రిడి ద్వారా పలు ప్రాంతాల్లో ప్రసారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+