Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'నమస్తే ఆంధ్రప్రదేశ్' అంటున్న కేసీఆర్.. ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా.. బీఆర్ఎస్ ప్రచారాస్త్రం!!

ఏపీలో పత్రికతో 'నమస్తే ఆంధ్రప్రదేశ్' తో రెడీ అయిన కేసీఆర్, ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా.. బీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా ప్రాంతీయ భాషల్లో పత్రికలను ప్రారంభించనున్నారు.

బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి 2024 ఎన్నికల లక్ష్యంగా దూసుకుపోతున్న నాయకుడు. వివిధ రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పాగా వేయడానికి గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగా నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో పత్రికను ఏపీలో ప్రారంభించాలని కెసిఆర్ భావిస్తున్నారు.

ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్

ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్

బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలను, బీఆర్ఎస్ అజెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి పత్రికనే మాధ్యమంగా భావిస్తూ కెసిఆర్ నమస్తే ఆంధ్ర ప్రదేశ్ పత్రికను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. సొంత పత్రిక ఉంటేనే తమ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రచారం జోరుగా జరుగుతుందని భావించి తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక తరహాలో ఏపీలో కూడా నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రికను ప్రారంభించాలని కెసిఆర్ భావిస్తూ, ఇందుకు అవసరమైన కసరత్తును కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లో పత్రికల ఏర్పాటుకు బీఆర్ఎస్

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లో పత్రికల ఏర్పాటుకు బీఆర్ఎస్


ఏపీ తెలంగాణ రాష్ట్రాల విభజన తర్వాత ఇప్పటివరకు కొత్త దినపత్రికలు ఏవి ఏపీలో కొత్తగా అడుగు పెట్టలేదు. ఇప్పటికే ఉన్న పత్రికలు ఉనికిని కోల్పోయి మూతపడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కెసిఆర్ పత్రిక పెట్టడం వైపే ముగ్గు చూపడం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ భాషల్లో పత్రికలను ప్రారంభించడం కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం.

సొంత మీడియా ఉంటేనే పార్టీ లక్ష్యం నెరవేరుతుందన్న కేసీఆర్

సొంత మీడియా ఉంటేనే పార్టీ లక్ష్యం నెరవేరుతుందన్న కేసీఆర్


నమస్తే తెలంగాణ పత్రిక తరహాలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక కోసం రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందని తెలుస్తుంది. పత్రికకు సంబంధించిన ప్రింటింగ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇక మంచి ముహూర్తం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రికను ప్రారంభించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. సొంత మీడియా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో కేసిఆర్ పలు ప్రాంతీయ భాషల్లో పత్రికలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం

బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం


తెలుగుతోపాటు కర్ణాటక, ఒడిస్సా, మహారాష్ట్ర, రాష్ట్రాలలోని ప్రాంతీయ భాషలలోను, హిందీ భాషలోనూ పత్రికల్ని ప్రారంభించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పత్రికలన్నిటికీ వారి వారి అజెండాను పబ్లిసిటీ చేయడానికి పత్రికలు ఉన్నాయి. ఇక బి ఆర్ ఎస్ ను విస్తరించాలంటే సొంత మీడియా అవసరమని భావిస్తున్న కెసిఆర్ ఈ మేరకు ప్రాంతీయ భాషల్లో పత్రికలను ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారో ?

కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారో ?


తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడంతో, నమస్తే తెలంగాణను విస్తరించే అవకాశం లేకపోవడంతో, వివిధ రాష్ట్రాలలో ఆయా భాషలలో పత్రికలను ఆ ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ పత్రికలుగా ప్రారంభించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న పనే అయినా కేసీఆర్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. మరి ఈ ప్రయత్నంలో కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+