పాట రాస్తా, తట్ట మోస్తా: స్మితాతో కేసీఆర్.. (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణలో చెరువుల పరిరక్షణ ప్రచారం కోసం తానూ పాట రాస్తానని, చెరువుల పునరుద్ధరణ కోసం తట్ట మోస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. చెరువుల పునరుద్ధరణ పైన ఇంజినీర్లతో హైదరాబాదులో కేసీఆర్ సమావేశమయ్యారు. చెరువుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తనతో పాటు మంత్రులు, కలెక్టర్లు కూడా తట్ట మోస్తారన్నారు. చెరువుల వైభవం ప్రజలకు తెలియజేసేలా ప్రభుత్వం తరపున కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. కళాబృందాలతో చెరువుల పరిరక్షణపై కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇరిగేషన్‌ను పట్టించుకోలేదని, చెరువుల పునరుద్ధరణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.

తమ ప్రభుత్వంలో రాబోయే నాలుగైదేళ్లలో ఇరిగేషన్ శాఖకు రూ.50వేల కోట్ల నుంచి రూ.70వేల కోట్లు ఖర్చుచేస్తామన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కల పెంపకం చేపడతామన్నారు.

చెరువులు నిండితే రైతులు బంగారం పండిస్తారన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా చెరువుల్లోకి నీళ్లు వస్తాయన్నారు. తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిస్తే కరవు కనిపించదన్నారు. మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ ఇస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

కేసీఆర్

కేసీఆర్

నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. వచ్చే నాలుగైదేళ్ళలో చెరువుల అలుగులు పొంగిపొర్లాలని, ఆ నీటిలో చేపలు పట్టుకోవాలని వ్యాఖ్యానించారు.

కేసీఆర్

కేసీఆర్

చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. చెరువులు నిండితే రైతులు సిరులు పండిస్తారని కే చంద్రశేఖర రావు ఈ సందర్భంగా అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌తో కేసీఆర్ ముచ్చట.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేతిలోని ఫైల్ చూస్తున్న స్మితా సబర్వాల్.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మంత్రి హరీష్ రావుతో..

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మంత్రి హరీష్ రావుతో..

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. చెరువులు పరిశుభ్రంగా ఉండాలని, పిచ్చి మొక్కలకు తావుండరాదని సూచించారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. చెరువుల్లో పూడికను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఇందుకోసం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో చెరువులు, కుంటలు సర్వే చేయాలన్నారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. హాజరైన అధికారులు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు జెఎన్టీయులో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు సర్వే చేయాలని, ఈ సర్వేలో అత్యాధునిక పరికరాలను వినియోగించాలన్నారు.

ఉద్యమంలో అగర్వాల్స్‌ది కీలక పాత్ర: కేసీఆర్

1969 తెలంగాణ ఉద్యమంలో అగర్వాల్లది కీలక పాత్ర అని కేసీఆర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు జరిగాయి. అఖిల భారత వైశ్య సమాఖ్య, అగర్వాల్ సమాజ్ కేంద్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భాగ్యనగర్ అభివృద్ధికి వైశ్యులు, మార్వాడీలు చేస్తున్న కృషి అమోఘమన్నారు.

సింగపూర్ తరహాలో హైదరాబాదు మెట్రో పాలిసిటన్ సిటీగా చేస్తామని, ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో వ్యాపారులపై అవినీతి వేధింపులు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్, పరిశ్రమ విధానం వంటి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. తెలంగాణలో వ్యాపారాలు ప్రారంభించే వారికి సహకరిస్తామన్నారు. ఐటీఐర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.1969 ఉద్యమంలో అగర్వాల్స్‌ది కీలక పాత్ర అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+