2017 ఏప్రిల్ నాటికి మెట్రో, వారు శంషాబాద్‌ను పక్కన పెట్టారు: కేసీఆర్
హైదరాబాద్: 2017 ఏప్రిల్ నాటికి మెట్రో రైలు పనులు పూర్తి కావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఇన్నర్ రింగు రోడ్డు మీదుగా మెట్రో విస్తరణపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకునేందుకు ఫలక్‌నుమా, రాయదుర్గం నుండి మెట్రో మార్గం వేయాలన్నారు. హైదరాబాద్ వాసులకు కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఉపయోగపడేలా మెట్రో రైలు సేవలు ఉండాలన్నారు.
ఢిల్లీ తరహా భద్రతా వ్యస్త హైదరాబాద్ మెట్రో రైలుకు కల్పించాలన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ నుండి వచ్చే ప్రయాణీకులు మెట్రో రైలు సేవలు వినియోగించుకునేలా చూడాలన్నారు.

గతంలో ప్రాజెక్టు డిజైన్ చేసిన వారు శంషాబాద్ విమానాశ్రయాన్ని విస్మరించారన్నారు. ఇన్నర్ రింగు రోడ్డును ఆనుకొని రైలు మార్గం నిర్మించాలన్నారు. మెట్రో రైలుకు విద్యుత్ సబ్సిడీ అందించేందుకు కేసీఆర్ అంగీకరించారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిందన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టు పని తీరు పైన సీఎస్ ఆధ్వర్యంలో ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామన్నారు. భూసేకరణష పునరావాసం, రోడ్డు వెడల్పు కార్యక్రమాలను ప్రభుత్వమే చేపడుతుందన్నారు. రైల్వే లైన్ల వద్ద 8 ఆర్వోబీల నిర్మాణానికి అనుమతి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications