హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజాం పుణ్యమా అని హుస్సేన్ సాగర్, లోటు తీరుస్తోంది: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విశ్వ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్ధే ఉద్ధేశంతో ముందుకెళ్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. శుక్రవారంనాడు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా బి వెంకటేశ్వరు విశ్వనగరంగా హైదరాబాద్‌కు ప్రఖ్యాతి తీసుకోవాలని రెండో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై కెసిఆర్ మాట్లాడారు.

నిజాం వారి పుణ్యమా అని నగరంలో హుస్సేన్‌సాగర్‌లో ఉందన్నారు. హైదరాబాద్‌కు సముద్రం లేని లోటు హుస్సేన్‌సాగర్ తీరుస్తోందని అన్నారు. హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు.

 KCR says Hussain Sagar is like ocean for Hyderabad

టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల్లో పలువురు నేతలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ బంగారు తెలంగాణకు పునరంకితం కావాలని మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశ్వనగరంగా హైదరాబాద్‌కు ప్రఖ్యాతి తీసుకోవాలని బి వెంకటేశ్వర్లు రెండో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ ప్రజాసంక్షేమాన్ని కోరుతూ ప్రజలకు భద్రత, భరోసా ఇచ్చేలా ప్రవేశపెట్టిన పథకాలపై మూడో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోరుతూ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు నాలుగో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు ఎందుకుని ఆయన తన తీర్మానంలో ప్రశ్నించారు. కాకతీయ మిషన్‌పై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రతిపాదించారు.

English summary
Telangana CM and Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar rao praised once again Nizam for constructing Hussain Sagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X