ఏపీలో కాలు పెట్టేందుకు కేసీఆర్ 'ఉక్కు' వ్యూహం!!
గులాబీ బాస్ కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టబోతున్నారా? ఏపీలో సభకు సన్నాహాలు చేస్తున్నారా? ఏపీలో అడుగుపెట్టడానికి కెసిఆర్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గులాబీ దళపతి అదును చూసి ఏపీలో అడుగు పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలాకాలంగా కేంద్రంతో పోరాడుతున్న ఒక అంశాన్ని అస్త్రంగా తీసుకొని ఏపీలో అడుగు పెట్టబోతున్నారు.
ఏపీలో అడుగు పెట్టటానికి అదును కోసం చూస్తున్న కేసీఆర్ : బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 2022 డిసెంబర్ 9వ తేదీన బిఆర్ఎస్ పార్టీని ప్రారంభించి దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన గులాబీ బాస్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలలో పార్టీని విస్తరించి పాగా వేయాలనుకున్నారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో పార్టీని విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్ అక్కడ వచ్చే జడ్పిటిసి ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. 12 జెడ్పిటిసి స్థానాలలో బిఆర్ఎస్ ను రంగంలోకి దించడానికి కెసిఆర్ రెడీ అయ్యారని తెలుస్తుంది. ఇక మహారాష్ట్రలో పార్టీని విస్తరిస్తున్న కేసీఆర్, పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీలో కాలు పెట్టడానికి సరైన అవకాశం దొరకలేదు.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ జాప్యం : జనవరి 2న కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీ రాజకీయాలలో కేసీఆర్ యాక్టివ్ అవుతారని భావిస్తే ఇంతకాలం ఆ ప్రయత్నం జరగలేదు. ఏపీలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయాలని భావించి అనేకమార్లు ప్రకటన చేసినప్పటికీ, దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఖమ్మంలో నిర్వహించిన బి ఆర్ ఎస్ బహిరంగ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో బహిరంగ సభకు ప్లాన్ చేసినా, ఆ ప్రయత్నం వాయిదా పడింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా ఏపీలో అడుగు : ఇక తాజాగా ఏపీలో ప్రధానంగా సమస్యగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ లేఖ రాయడం, ఏపీ బీఆర్ఎస్ నేతలు కూడా విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ వంతు మద్దతుగా నిలుస్తామని చెప్పడం, కెసిఆర్ భారీ బహిరంగ సభకు జరిగిన సన్నాహంగా చెప్పొచ్చు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడి రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న కేసీఆర్ అక్కడి ప్రజలను మన్ననలు పొందాలంటే వారి సమస్యలను తెలుసుకొని, వాటి కోసం పోరాటం చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ మూడవ వారంలో వైజాగ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన బాధ్యతలను కూడా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించిన గులాబీ బాస్ ఏపీలో బలంగా అడుగు పెట్టడానికి కసరత్తులు మొదలుపెట్టారు.
కేసీఆర్ సక్సెస్ అవుతారా? : ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను, కార్మికులను కలిసి వారికి మద్దతుగా నిలవాలని ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను కెసిఆర్ ఆదేశించారు. ఇక విశాఖలో జరిగే సభ వేదికగా కెసిఆర్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో పాటు, ఏపీ ప్రజలను బీఆర్ఎస్ వైపు మళ్ళించడానికి ఏం చేయబోతున్నారు? ఈ ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ అవుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications