తెలంగాణ వంటకాల రుచి చూసిన కెసిఆర్: నాలాగే ఈటెల సన్నగా...
హైదరాబాద్: తెలగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులతో కలిసి శుక్రవారంనాడు భోజనం చేశారు. ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సమావేశం జరిగిన ఎల్బీ స్టీడియంలోనే భోజనాలు ఏర్పాటు చేశారు.
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీష్ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి, వేణుగోపాల చారిలతో పాటు కలిసి కెసిఆర్ భోజనం చేశారు. కెసిఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అక్కడే భోజనం చేశారు. ఆమె ఇతర మహిళా నాయకులు వడ్జించడం కనిపించింది.
టిఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నోరూరించే తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ వంటకాల ఘాటు వాసనలు కూడా అలుముకున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్‌కు ఇదే తొలి ప్లీనరీ.

కెసిఆర్ మాదిరిగానే ఈటెల
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాదిరిగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సన్నగా ఉంటాడని కెసిఆర్ అన్నారు. తన అధ్యక్షోపన్యాసంలో ఈటెల రాజేందర్ ప్రస్తావన తెస్తూ ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా పాఠశాలల్లో సన్న బియ్యంతో చేసిన భోజనాన్ని ఆందించలేదని కెసిఆర్ చెప్పారు.
తాను హాస్టల్లో ఉండి చదువుకున్నానని, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం భోజనం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని తమ్ముడు ఈటెల రాజేందర్ కోరాడని, ఏ మాత్రం ఆలోచించకుండా సన్న బియ్యం మంజూరు చేయాలని ఆదేశించానని కెసిఆర్ వివరించారు.
రాష్ట్ర విభజనకు ముందు ఉడకని అన్నం, దొడ్డు బియ్యం అన్నం తిన్న హాస్టల్ విద్యార్తులకు సన్న బియ్యం అందించామని కెసిఆర్ చెప్పారు. సన్న బియ్యం పథకానికి ఛాంపియన్ తమ్ముడు రాజేందరే అని ఆయన అన్నారు
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications