హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రేతర లిక్కర్ బ్రాండ్లపై కెసిఆర్: మెట్రో విస్తరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబద్: తెలంగాణలోనే మద్యం ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం త్వరితగతిన ఫ్యాక్టరీల నిర్మాణం జరిగేలా చూడాలని కెసిఆర్ ఆబ్కారీ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

కాగా, చాలా లిక్కర్ బ్రాండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్ాయని, దాని వల్ల రాష్ట్రానికి చాలా పన్నులు పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్ డిమాండ్‌ను బట్ట రాష్ట్రంలో డిస్టిల్లరీలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరిన్ని డిస్టిల్లరీలను ఏర్పాటు చేసే విషయంపై ఆలోచన చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గుడుంబాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.

K Chandrasekhar Rao

కాగా, ఎల్‌అండ్‌టీ అధికారులతో కెసిఆర్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. మెట్రో విస్తరణ, కొత్త లైన్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముంబై తరహాలో పోలీస్‌ కంట్రోల్‌ కమాండ్‌ బిల్డింగ్‌ ఏర్పాటు కోసం కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని ఎల్‌అండ్‌టీ అధికారులకు కెసిఆర్ సూచించారు.

మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరిస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కెసిఆర్ రైలు మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏయే ప్రాంతాల్లో మెట్రో రైలును విస్తరించాలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు.

హైదరాబాద్ నగరంలో ప్రజా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కెసిఆర్ ఆదేశించారు. ఇందుకు పలు చోట్ల సిసి కెమెరాలను పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలోని వివిధ జంక్షన్లలో ఏర్పాటు చేసేందుకు ఎన్ని సిసీ కెమెరాలు అవసరమో, వాటి పనితీరు ఎలా ఉంటుందో అధ్యయనం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముంబైలో ఎల్ అండ్ టీ ఏర్పాటు చేసిన సిసీ కమెరాల వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక బృందం ముంబై వెళ్లి వాటిని అధ్యయనం చేసి రావాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లో పోలీస కంట్రోల్ కమాండ్ బిల్డింగ్ నిర్మించాలని ఆయన నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగుల పీఆర్సీపై ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. పిఆర్స్‌పై కెసిఆర్ పలు ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రదీప్ చంద్ర నేతృత్వంలో పిఆర్సీపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం ప్రకిటంచారు. కమిటీలో మెంబర్ కన్వీనర్‌గా శివశంకర్, సభ్యులుగా ఎంజి గోపాల్, ఆర్ఆర్ ఆచార్య ఉంటారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.

English summary
Telangana CM K chandrasekhar Rao unhappy with the out side liquoir brands in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X