'శంకుస్థాపన మహోత్సవం విజయవంతం, అందుకే విషం కక్కుతున్నారు'
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం విజయవంతం కావడాన్ని తట్టుకోలేక ప్రభుత్వంపై కొంత మంది విషం కక్కుతున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన విజయవంతం కావడం ద్వారా సీఎం చంద్రబాబు శక్తిసామర్థ్యాలు అందరికీ తెలిసాయన్నారు.
నిజాన్ని జీర్ణించుకోలేక చాలా మంది ఏదో రకంగా ఆందోళన, నిరసనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ ఇంటికి- మీ భూమి రెండో విడత కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అడంగళ్ కాపీని పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా స్థాయిలో టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రెవెన్యూశాఖలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications