పార్టీలో కోటి లేరు కానీ: కేఈ, జగన్ పార్టీపై యనమల
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కోటి మంది కూడా లేరని, కానీ కోటి సంతకాల సేకరణ చేపట్టారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం ఎద్దేవా చేవారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఉనికి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందన్నారు.
మరో ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ... ఫ్యాక్షనిజం తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తెచ్చేందుక గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను దాదాపు 90 శాతం తగ్గించామన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలంటే అందరూ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని వదిలేయాలన్నారు.
జగన్ పార్టీకి అదే గతి: యనమల

కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమాధి చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు.
రాష్ట్రం రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, లోటుబడ్జెట్‌ను పూడ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇస్తుందన్న నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications