కాంగ్రెస్ పై ఫిర్యాదు : అమ‌రావ‌తి కి అందుకోస‌మే : చూసుకుంటానంటూ బాబు హామీ..!

కాంగ్రెస్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత వద్ద‌కు వెళ్ల‌లేదు. ఢిల్లీలోనే ఉన్న రాహుల్ ను క‌ల‌వ‌లేదు. కాంగ్రెస్ పై ఫిర్యాదు చేసేందుకు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చారు. త‌న ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు. చంద్ర‌బాబు అభ‌యం ఇచ్చారు. అంతా తాను చూసుకుంటాన‌ని హామీ ఇచ్చేసారు.

కాంగ్రెస్ పై ఫిర్యాదు..
ఢిల్లీ కేజ్రీవాల్ అమ‌రావ‌తి వ‌చ్చారు. ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ పొత్తు కుదరకుండా.. ఢిల్లీ, పంజాబ్‌, హరియాణాల్లోని స్థానిక కాంగ్రెస్‌ నేతలు అడ్డుకుంటున్నారని ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుంటే తామెందుకు సహించి ఊరుకోవాలని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ వ్యవహార శైలికి నిరసనగా గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలపడానికి కేజ్రీవాల్‌ అక్కడకు వచ్చారు.

Kejriwal complaint on congress : Babu assured will take care..

తిరుగు ప్రయాణంలో అమరావతికి వస్తే మాట్లాడుకోవడానికి వీలుపడుతుందా అని చంద్రబాబును సంప్ర‌దించారు. ఇబ్బందే మీ లేదని.. అమ‌రావ‌తికి రావాలని టీడీపీ అధినేత కోరారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రె్‌సకు... ఆప్‌ పార్టీకి మధ్య సీట్ల సర్దు బాటు కు ఉన్న అవకాశాలపై ఎక్కువగా మాట్లాడుకున్నారు. సర్దుబాటు కుదిరే వాతావరణాన్ని కాంగ్రెస్‌ స్ధానిక నేతలు ఉద్దేశపూర్వకంగా చెడగొడుతున్నారని, కాంగ్రెస్‌ నాయకత్వం ఆలోచన ఏమిటో తెలిస్తే తమ పని తాము చేసుకుంటామ ని .. సీట్ల సర్దుబాటుకైనా, ఒంటరి పోరుకైనా తాము సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలం టే ఇరు పార్టీలు పట్టువిడుపులతో వెళ్లాల్సిన అవ‌స‌రాన్ని కేజ్రీవాల్ వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

రాహుల్ తో మాట్లాడుతా..
అంతకు ముందు శివసేనను బీజేపీ లెక్క చేసేది కాదు. కానీ ప్రతిపక్షాలన్నీ కలుస్తుండేసరికి భయపడి శివసేనతో రాజీపడిపోయి పెద్ద సంఖ్యలో సీట్లు ఇచ్చి సర్దుబాటు చేసుకుంది...ఈ ప‌రిస్థితుల్లో బిజెపి వ్య‌తిరేక పార్టీల మధ్య కూడా అటువంటి సర్దుబాబు ధోరణి అవసరం అని కేజ్రీ అభిప్రాయ ప‌డ్డారు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని, అంతవరకూ ఓపిక పట్టాలని కేజ్రీవాల్‌ను కోరారు.

Kejriwal complaint on congress : Babu assured will take care..

దానికి ఢిల్లీ సీఎం అంగీకరించినట్లు సమాచారం. జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణం తదితర అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ఢిల్లీలో మళ్లీ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాలని విపక్ష కూటమి నేతలు గతంలోనే నిర్ణయించారు. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకుని దాని ఆధారంగా ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+