శబరిమలకు వచ్చే భక్తులకు కేరళ ప్రభుత్వం బిగ్ అప్డేట్..!!
శబరిమలకు భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కొత్త ఆవిష్కరణ చేసింది. అయ్యప్ప దర్శనం కోసం భారీగా తరలి వచ్చే భక్తులకు ఏఐ చాట్‌బాట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు శబరిమల యాత్ర సమాచారంతో పాటుగా వారికి మరింత సహాయకారిగా ఉండేలా దీనిని సిద్దం చేసారు. పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన ఈ చాట్‌బాట్ లోగోను సీఎం పినరయి విజయన్ ఆవిష్కరించారు.
స్వామి చాట్‌బాట్
అయ్యప్పస్వామి భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఏఐ సాధనం 'స్వామి' చాట్‌బాట్ లోగో ను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవిష్కరించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ వెసులుబాటు కలిగించిన అధికారులను సీఎం అభినందించారు. ఆరు భాషల్లో ఈ చాట్ బాట్ పూర్తి సమాచారం అందిస్తుంది. మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడలో శబరిమల గురించి సమగ్ర సమాచారాన్ని 'స్వామి చాట్‌బాట్' అందిస్తుందని అధికారులు వెల్లడంచారు.

పూర్తి సమాచారం
ఈ చాట్‌బాట్ ద్వారా శబరిమలలో పూజా సమయాలతోపాటు రైల్వే, విమాన సౌకర్యాలను తెలియజేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చు. శబరిమలలో నవంబర్ 15న మండల పూజా మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో 'స్వామి చాట్‌బాట్'ను స్వామి భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా భక్తులకు శబరిమల యాత్ర అనుభవం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ 'స్వామి చాట్‌బాట్' స్థానికంగా భాష తెలియక ఇబ్బంది పడే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే స్వాములకు మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
Honoured to unveil the logo of Swami Chat Bot, a smart AI tool developed by the Pathanamthitta district administration to enhance the Sabarimala pilgrimage experience. Accessible in six languages, it offers vital info on temple services, travel, and safety, ensuring a smooth,… pic.twitter.com/EgzzGErQYW
— Pinarayi Vijayan (@pinarayivijayan) November 13, 2024
భక్తులకు సమాచారం
దీని ద్వారా శబరిమల పూజా సమయాలు, రవాణా సౌకర్యాలు, ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ల సమాచారం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పోలీస్, అటవీ శాఖల ద్వారా కూడా యాత్రికులకు సేవలు అందించి వారి తీర్థయాత్ర ఆనందకరం చేస్తుందని అధికారులు8 వెల్లడించారు. మకర సంక్రాంతి వరకు శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగనుంది. గత అనుభవాల తో ఈ సారి ప్రభుత్వంతో పాటుగా ట్రావెన్ కోర్ బోర్డు సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు.. రద్దీ పైన ఫోకస్ చేసింది. అదే విధంగా దర్మనాల సంఖ్య.. అనుమతి, పరిమితుల విషయంలోనూ ఇప్పటికే బోర్డు పలు నిర్ణయాలు తీసుకుంది. అటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications