కామవాంఛ తీర్చుకుని యువతిని వదిలేసిన కేరళ యువకుడు
హైదరాబాద్ : ప్రేమించాన్నంటూ ఓ యువతిని లోబర్చుకొని, పెళ్లి ప్రస్తావన రాగానే ప్లేటు ఫిరాయించిన ఓ యువకుడిని పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం - ఒడిషా రాష్ర్టానికి చెందిన యువతి(25) మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
అదే కంపెనీలో పనిచేస్తూ టోలిచౌకిలో నివాసముంటున్న కేరళా వాస్తవ్యుడు నితిన్ థామస్ జాన్ (26)తో ఆమెకు రెండేళ్లక్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతితో కామవాంఛ తీర్చుకున్న జాన్ పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేవడంతో దాటవేశాడు.

తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన ఆ యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా జాన్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదిలావుంటే, ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం సోనాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వి. భూమయ్య (35) కుటుంబ కలహాల కారణంగా మంగళవారం అర్థరాత్రి పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో వెళ్లిన అతన్ని హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications