కేసీఆర్ డప్పులు కొట్టుకుంటున్నారు: కేశినేని నాని, బాబుపై ఇలా

హైదరాబాద్/అమరావతి: ఏపీ తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ కేశినేని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆయన శనివారం మాట్లాడుతూ.. తమది సంపన్న రాష్ట్రమని తెలంగాణ సీఎం కేసీఆర్ డప్పులు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు బిల్లులు కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు.

kesineni nani fires at KCR

అంతేగాక, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించే పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. 43శాతం షిట్ మెంట్‌ ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసిందని అన్నారు.

దేశంలోనే చంద్రబాబు గొప్ప ఆర్థికవేత్త అని కేశినేని నాని కొనియడారు. సంపదను సృష్టించడంలో చంద్రబాబునాయుడును మించిన వారు లేని ప్రశంసించారు. ఏపీలో సంపద సృష్టించి అభివృద్ధి బాటలో నడుపుతున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+