వైసీపీ ఎంపీల రాజీనామాల రహస్యం అదే: కేశినేని నాని, ‘బీజేపీతోనే జగన్, పవన్, ఇవే నిదర్శనం’

న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే.. ముందస్తుగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఆరోపించారు.

Recommended Video

    చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం
    వైసీపీ ఎంపీల రాజీనామాల వెనక..

    వైసీపీ ఎంపీల రాజీనామాల వెనక..

    పార్లమెంటులో చర్చ సందర్భంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై మాట్లాడాల్సి వస్తుందని, బీజేపీని నిలదీయాల్సి వస్తుందని అన్నారు. అయితే, బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఆ పనిచేయలేరని.. అందుకే వారు ముందుగా రాజీనామాలు చేశారన్నారు. టీడీపీ మాత్రం కేంద్రం చేసిన అన్యాయంపై పార్లమెంటులో ప్రశ్నిస్తుందని కేశినేని నాని చెప్పారు. అవిశ్వాసం చర్చ సందర్భంగా విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సహా 14అంశాలపై నిలదీస్తామని అన్నారు. కేంద్రం వైఖరిని ఎండగడతామని అన్నారు.

    బీజేపీ అడగడం హాస్యాస్పదం

    బీజేపీ అడగడం హాస్యాస్పదం

    ఇది ఇలావుంటే, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేతలు అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ముందు చట్ట ప్రకారం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి.. ఆ తర్వాతే శ్వేతపత్రం గురించి అడగాలని అన్నారు.

    జగన్‌ను సీఎం చేస్తామంటూ..

    జగన్‌ను సీఎం చేస్తామంటూ..

    ఉపాధి నిధులు, రోడ్లు, ఇళ్లు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారని, కామన్ కేటగిరీ కింద ఏపీకి ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏయే కేటగిరిల కింద ఎంతెంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏలోకి వస్తే వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలతో ఇరుపార్టీల మధ్య ఉన్న లాలూచీ రాజకీయాలు తేటతెల్లమయ్యాయని వ్యాఖ్యానించారు.

    బీజేపీ చెప్పు చేతల్లో పవన్..

    బీజేపీ చెప్పు చేతల్లో పవన్..

    అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఒక నిందితుడితో పొత్తుకు బీజేపీ తహతహలాడుతోందని యనమల రామకృష్ణుడు అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ చెప్పుచేతల్లోనే ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ప్రశ్నించడం మానేసి, టీడీపీని విమర్శిస్తుండటమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+