Kesineni Nani:సిద్ధం సభా వేదికపై కేశినేని నాని ఆసక్తికర స్పీచ్: ఎవరెలాంటి వారో క్లారిటీ..
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోన్నారు. ఎన్నికల సమరానికి సన్నద్ధమౌతోన్నారు.
విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. దీనికి కొనసాగింపుగా రెండో బహిరంగ సభను ఏలూరు జిల్లా దెందులూరు నిర్వహించింది వైఎస్ఆర్సీపీ.

ఈ బహిరంగ సభలో విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని పాల్గొన్నారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీకి, లోక్‌సభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన నాని.. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఓ బహిరంగ సభకు హాజరు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టి ఆయనపైనే నిలిచింది.
ఈ సభ వేదికపై నుంచి కేశినేని మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్- చంద్రబాబు నాయుడి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బయటపెట్టారు. ఇద్దరి వ్యక్తిత్వాన్ని పోల్చి చూశారు. నిజాయితీకి జగన్ మారుపేరయితే.. నమ్మక ద్రోహానికి చంద్రబాబు నిలువుటద్దమని అన్నారు.
జగన్ పేదల పక్షపాతి కాగా.. ధనికుల పక్షాన నిలిచే వ్యక్తి చంద్రబాబుగా అభివర్ణించారు. జగన్ సమాజం కోసం పాటుపడుతుంటే.. తన పనికిరాని కొడుకు కోసం చంద్రబాబు పాటు పడుతున్నాడని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీని అమలు చేసిన రాష్ట్రం.. మరొకటి లేదని తేల్చి చెప్పారు.
పేదల కోసం రెండున్నర లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చుచేసిన ముఖ్యమంత్రి మరొకరు లేరని కేశినేని నాని అన్నారు. విద్యా, వైద్యం, పేదల జీవన విధానాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తోన్నాడని, ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications