Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు కు కేశినేని షాక్ - దురుసుగా: అందరి సమక్షంలో : ఢిల్లీలో అడుగు పెట్టగానే..!!

టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఇంకా పార్టీ నాయకత్వంపైన అలక వీడలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన ఆగ్రహంతో ఉన్న ఆయన..ఇప్పుడు డిల్లీ కేంద్రంగా తన ఆగ్రహాన్ని బయట పెట్టారు. ఢిల్లీ పర్యటన కు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే కేశినేని దురుసుగా వ్యవహరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. లోక్ సభ సభ్యులు గల్లా జయదేవ్..కేశినేని నాని.. రామ్మోహన్ నాయుడు.. రాజ్యసభ సభ్యుడు కనకమేడల స్వాగతం పలికేందుకు విమానాశ్రయంకు వచ్చారు.

ఢిల్లీ వేదికగా మరోసారి కేశినేని నాని

ఢిల్లీ వేదికగా మరోసారి కేశినేని నాని

అక్కడ ఏయిర్ పోర్టు లాంజ్ వరకు చంద్రబాబుతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్నా ఎంపీ కేశినేని నాని కొంత అసహనంగా కనిపించారు. దూరంగానే ఉండే ప్రయత్నం చేసారు. ఇక, పార్టీ ఎంపీలు తమ అధినేతకు శాలువా కప్పి..పుష్పగుకచ్చం ఇచ్చే ప్రయత్నం చేసారు.

ఆ సమయంలో పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గల్లా జయదేవ్ విజయవాడ ఎంపీ కేశినేని నానికి పుష్పగుచ్ఛం ఇచ్చి చంద్రబాబుకు ఇవ్వాలని కోరారు. అయితే, అందరి సమక్షంలోనే కేశినేని నాని పష్పగుచ్ఛాన్ని విసురుగా తోసేసారు. మీరు ఇవ్వండి అంటూ జయదేవ్ తో సీరియస్ గా చెప్పారు. ఇదంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగింది. మొత్తం చూస్తున్న చంద్రబాబు మౌనంగానే ఉన్నారు.

చంద్రబాబు మౌనంగా చూస్తూ

చంద్రబాబు మౌనంగా చూస్తూ

అయితే, కేశినేని నాని నివాసంలో తాజాగా ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్ధ కార్యక్రమంలోనూ చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. ఆ సమయంలో చంద్రబాబుతో ఎంపీ నాని సన్నిహితంగానే కనిపించారు. అయితే, ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు వచ్చిన సమయంలో ఈ విధంగా వ్యవహరించటం పైన చర్చ మొదలైంది.

పార్టీ ఫ్లోర్ లీడర్ గా జయదేవ్ కు ఇచ్చిన సమయంలోనే కేశినేని నాని అలక బూనారు. ఇక..కొంత కాలంగా విజయవాడ టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కేశినేని నాని సీరియస్ గా ఉన్నారు. ఢిల్లీలో ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యలు చేయటం.. సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్టు చేయటంతో..ఆయనలో ఇక టీడీపీలో కొనసాగరనే అభిప్రాయం పార్టీలో నేతలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని పోటీ చేయరనే ప్రచారమూ సాగింది. ఆయన సోదరుడిని పార్టీలో ఎంపీ నాని వ్యతిరేకులు ప్రోత్సహిస్తున్నారనేది నాని అభియోగం.

నాని ఆగ్రహం ఎవరి పైన

నాని ఆగ్రహం ఎవరి పైన

ఈ మధ్య కాలంలో కేశినేని సోదరుల మధ్య గ్యాప్ పెరిగింది. మద్దతు కోరుతూ కేశినేని నాని సోదరుడు చిన్ని తాజాగా వంగవీటి రాధాను సైతం కలిశారు. ఇలా..కేశినేని నాని ఎపిసోడ్ కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా అధినేతకు స్వాగతం పలికే వేళ..కేశినేని నాని ముభావంగా ఉండటం.. దూరం మెయిన్ టెయిన్ చేయటం పైన టీడీపీలో ఆసక్తి కర చర్చ మొదలైంది.

నాని అసహనం చంద్రబాబు పైనా..గల్లా జయదేవ్ పైనా అనే చర్చ కూడా వినిపిస్తోంది. దీంతో..ఈ వివాదం పైనా..తన భవిష్యత్ కార్యాచరణ పైన కేశినేని నాని ఎటువంటి స్పష్టత ఇస్తారనేది చూడాలి. కాసేపట్లో చంద్రబాబు పార్టీ ఎంపీలతో గల్లా జయదేవ్ నివాసంలో సమావేశం కానున్నారు. ఆ తరువాత రాష్ట్రపతి ముర్ముతో భేటీ అవుతారు. ప్రధాని అధ్యక్షతన జరిగే ఆజాదీ కా మహోత్సవ్ సమావేశానికి హాజరవుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+